Discount On iPhone 15 Plus : ఐఫోన్ పై బిగ్ డిస్కౌంట్ డీల్స్ ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ లో iphone 15 పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ కొససాగుతున్న విషయం తెలిసిందే.. ఈ డిస్కౌంట్ సేల్‌లో భాగంగా iPhone 15 Plus పై అద్భుతమైన డీల్ ప్రవేశపెట్టింది.
కస్టమర్లు ఈ ఫోన్ ను రూ. 20 వేల వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 15 ప్లస్ మొబైల్ 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ. 89,900 ధరకు ప్రారంభించారు. అయితే, ఇప్పుడు దీని ధర రూ. 79,900కి తగ్గింది. కానీ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా దీని ధర కేవలం రూ. 63,999 కి పడిపోయింది.
ఆఫర్ ఎలా పొందాలి?
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో మీరు ఏ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌తో చెల్లించినా రూ.1,000 తగ్గింపు అందిస్తున్నారు. అలాగే Flipkart UPI లేదా ఇతర UPI పేమెంట్ల ద్వారా చెల్లించినా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. Flipkart Axis Bank Credit Card వినియోగదారులకు 5% క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఇంకా అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్‌ను ఇచ్చి రూ. 41,150 వరకు ఎక్స్‌చేంజ్ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన మోడల్స్‌పై అదనంగా రూ. 3,000 డిస్కౌంట్ లభిస్తుంది.
iPhone 15 Plus ఫీచర్స్
ఆపిల్ iPhone 15 Plus స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంటుంది. హైపర్‌ఫార్మెన్స్ కలిగిన A16 Bionic ప్రాసెసర్, 48MP మెయిన్ కెమెరా, 12 MP సెకండరీ కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరాతో నాణ్యమైన వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు. ఇందులోని బ్యాటరీ కూడా పూర్తి రోజుకు సరిపడేలా పనిచేస్తుంది. ఇక ఐఫోన్ 15 ప్లస్ పింక్, బ్లూ, గ్రీన్, బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇకపోతే, iPhone 15 Plus ఈ డీల్ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కొత్త iPhone కొనుగోలుకు ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..