Neet PG 2024 dates : అలర్ట్.. నీట్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Neet PG 2024 dates : అలర్ట్..  నీట్ ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Neet PG 2024 dates : లోక్‌సభ ఎన్నికల కారణంగా నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024) పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ మేర‌కు నేషనల్ మెడికల్ కమిషన్ బుధవారం స‌వ‌రించిన షెడ్యూల్ ను ప్రకటించింది. దీని ప్రకారం నీట్ పీజీ 2024 పరీక్ష తేదీని మే 5వ తేదీ నుంచి జూన్ 23కు మార్చారు.

Neet PG 2024 dates : నీట్ పీజీ 2023 ఫలితాల విడుల‌య్యే తేదీని, అలాగే నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో కూడా మార్పులో చేశారు. అయితే ఇంటర్న్‌షిప్ చివరి తేదీ (Last Date)లో మాత్రం ఎలాంటి మార్పూలు చేయ‌ లేదు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ, డెరెక్టరేట్ జనరల్ ఫర్ హెల్త్ సైన్సెస్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్ తో కలిసి ప్రోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు, నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. నీట్ పీజీ 2024 పరీక్షలను జూన్ 23 న నిర్వహించనున్నారు. అడ్మిషన్లకు కౌన్సెలింగ్ ఆగస్టు 5 నుంచి 15 మధ్య చేప‌ట్ట‌నున్నారు. నీట్ పీజీ 2024 కు హాజరయ్యేందుకు అర్హతకు సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఆగస్టు 15వ తేదీన ప్రకటించ‌నున్నారు. కొత్త అకడమిక్ సెషన్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. సంబంధిత కాలేజీల్లో చేరేందుకు అక్టోబర్ 21 చివరి తేదీగా నిర్ణ‌యించారు.

READ MORE  Lok Sabha Exit polls | లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీట్లు.. తేల్చి చెప్పిన‌ సర్వే సంస్థలు..!

పూర్తి సవరించిన షెడ్యూల్:

  • NEET PG-2024 సవరించిన పరీక్ష తేదీ: జూన్ 23, 2024
  • NEET PG-2024 ఫలితాల ప్రకటన: జూలై 15, 2024 నాటికి
  • NEET PG-2024 కౌన్సెలింగ్: ఆగస్టు 5, 2024 నుండి అక్టోబర్ 15, 2024 వరకు
  • అకడమిక్ సెషన్ ప్రారంభం: సెప్టెంబర్ 16, 2024
  • ప్రవేశాలకు చివరి తేదీ: అక్టోబర్ 21, 2024

పాలీసెట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ డేట్‌ మారింది..!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (TS POLYCET)ను సైతం వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.  షెడ్యూల్‌ ప్రకారం మే 17న పాలీసెట్‌ నిర్వహించాల్సి ఉండగా.. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను మే 24కు  వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. తెలంగాణలో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.  నాలుగో విడత మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు.  ఏప్రిల్‌ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ,   26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది.

READ MORE  Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఏముంది..?

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *