Indian Railways Navratri Special Meal | నవరాత్రి పండుగ సీజన్ సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణికుల గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు రుచికరమైన భోజనాన్ని అందించేందుకు గానూ ‘నవరాత్రి వ్రత స్పెషల్ థాలి’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 150కి పైగా రైల్వే స్టేషన్లలో ఈ ‘నవరాత్రి స్పెషల్ థాలి’ భోజనాన్ని ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
సికింద్రాబాద్, ముంబై సహా వివిధ స్టేషన్లలో ప్రత్యేక భోజనాన్ని ప్రయాణికులు పొందవచ్చని, తయారీలో నాణ్యత, పోషకాహారం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకునట్లు రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఐఆర్‌సీటీసీ యాప్, ఈ-క్యాటరింగ్ వెబ్‌సైట్ నుంచి ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్ నంబర్‌తో ప్రత్యేక భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపారు.
Navratri Special Meal : నవరాత్రి వ్రత స్పెషల్ థాలి లభించే కొన్ని ముఖ్యమైన స్టేషన్లు
- ముంబై సెంట్రల్
- ఢిల్లీ జంక్షన్
- సూరత్
- జైపూర్
- లక్నో
- పాట్నా జంక్షన్
- లూధియానా
- దుర్గ్
- చెన్నై సెంట్రల్
- సికింద్రాబాద్
- అమరావతి
- హైదరాబాద్
- తిరుపతి
- జలంధర్ సిటీ
- ఉదయపూర్ సిటీ
- బెంగళూరు కాంట్
- న్యూఢిల్లీ
- థానే
- పూణే
- మంగళూరు సెంట్రల్ స్టేషన్
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..