Monday, September 8Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు

బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు

National
Bihar: బీహార్ లో కొందరు పోలీసులు అమానవీయ చర్యకు పాల్పడ్డారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్నిబీహార్ పోలీసులు (Bihar police) కాలువలో పడేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒక వీడియోలో సోషల్ మీడియాను షేక్ చేసింది. వ్యక్తి మృతదేహాన్ని ముగ్గురు పోలీసులు లాగడం.. తరువాత కాలువలో పడవేయడం ఈ వీడియోలో ఉంది. దీనిని చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.ముజఫర్‌పూర్‌ (Muzaffarpur)లోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో, ఇద్దరు పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని లాగడం చూడవచ్చు, ఆపై మృతదేహాన్ని కాలువలోకి విసిరేందుకు వారికి సహాయపడటానికి మూడో పోలీసు చేరాడు. ఈ ఘటనపై ఫకులీ ఓపీ ఇన్‌ఛార్జ్‌ మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రమాదంలో ట్రక్కు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితురాలి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. వాటిని పోస్టుమార్టం కోసం వెలికి త...
GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..

GST council meet : పండుగ పూట గుడ్ న్యూస్.. మిల్లెట్ల పిండిపై జీఎస్‌టీ భారీగా తగ్గింపు..

National
GST council meet: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జీఎస్‌టీని తగ్గిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్‌ వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంతకు ముందు దీనిపై జీఎస్‌టీ 28 శాతంగా ఉండేది. కాగా కనీసం 70 శాతం మిల్లెట్లతో కూడిన పిండిని విడిగా/ లూజుగా విక్రయిస్తే ఎలాంటి జీఎస్‌టీ వర్తించదని ఆర్థికమంత్రి తెలిపారు. మిల్లెట్ల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన 52వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం తర్వాత నిర్మలా సీతారామన్ సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ మీటింగ్ లోమొలాసిస్‌పై కూడా జీఎస్‌టీని 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. మొలాసిస్ పైనా ...
Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..

Sikkim Floods: ఆకస్మిక వరదల కారణంగా 19కి చేరిన మృతుల సంఖ్య.. ఇంకా తెలియని 103 మంది ఆచూకీ..

National
Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. 22 మంది ఆర్మీ సిబ్బందితో సహా 103 మంది అదృశ్యమయ్యారు. ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు తీస్తా నది పరీవాహక ప్రాంతంలో బురద మట్టిలో అలాగే ఉదృతంగా ప్రవహిస్తున్ననీటిలో గల్లంతైన వారికోసం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో భారీ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. కాగా ఈ వరదల్లో నలుగురు మృతదేహాలను 'జవాన్లు'గా గుర్తించినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.లాచెన్, లాచుంగ్‌లలో అనేక మంది బైకర్లు, విదేశీయులు, దాదాపు 700-800 మంది డ్రైవర్లతో సహా 3,000 మందికి పైగా ప్రజలు చిక్కుకుపోయారని, వారందరినీ ఆర్మీ, వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా రక్షించనున్నట్లు చీఫ్ సెక్రటరీ విబి పాఠక్ తెలిపారు.సిక్కిం చీఫ్ సెక్రటరీ విజయ్ భూషణ్ పాఠక్ ...
ఆరెంజ్ వందేభారత్ రైలు రంగు మార్పుపై క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి….అసలు కారణం ఇదే..

ఆరెంజ్ వందేభారత్ రైలు రంగు మార్పుపై క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి….అసలు కారణం ఇదే..

National
భారత దేశంలో కొత్తగా ప్రవేశపెట్టనున్న నారింజ రంగు వందే భారత్ రైళ్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. నారింజ రంగు వందేబారత్ రైళ్ల(Orange Vande Bharat Express train) ను  ప్రారంభించడం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. శాస్త్రీయ దృష్టితోనే ఈ నారింజ రంగును తీసుకున్నామని తెలిపారు.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జర్నలిస్టులతో జరిగిన సమాశం జరిగింది.  నారింజ రంగులో వందేభారత్ రైళ్లను ప్రారంభించడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు.. అయన ఈ విధంగా స్పందించారు."మానవుల కళ్లకు పసుపు, నారింజ రెండు రంగులు చాల స్పష్టంగా కనిపిస్తాయి. యూరప్ దేశాల్లో దాదాపు 80 శాతం రైళ్లు నారింజ లేదా పసుపు, నారింజ కలయిక ఉంటాయి" అని వైష్ణవ్ చెప్పారు. పసుపు.. నారింజ సిల్వర్ వంటి ప్రకాశవంతమైన అనేక ఇతర రంగులు ఉన్నాయి, కానీ మనం దాని గురించి మాట్లాడినట్లయ...
Sikkim flash floods : సిక్కింలో వరద బీభత్సం.. 23 మంది. ఆర్మీ జవాన్లు గల్లంతు.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు

Sikkim flash floods : సిక్కింలో వరద బీభత్సం.. 23 మంది. ఆర్మీ జవాన్లు గల్లంతు.. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు

National
Sikkim flash floods : ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. అనేక చోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తర సిక్కింలో భారీ వర్షాలతో తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద నీటిలో కొట్టుకుపోవడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. బుధవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఆకస్మిక వరద రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాలు కురవడంతో ఈ వరద ఏర్పడింది, దీని కారణంగా తీస్తాలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయి. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది. దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది.సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద ...
Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

Crime, National
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు.ఉదయం సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారుల సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీంతో అప్పటి నుంచి ఈ కేసు దే శవ్యాప్తంగా సంచలనంగా రేపింది. మద్యం పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీల నిఘాలో తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీ సర్కారు 2021 నాటి మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీ కేసు దాఖలు చేశారు. కానీ ఆ తర్వాత రద్దు చేశారు.Delhi Liquor Policy Case లో ఏ...
హైటెక్ ఫీచర్లతో  స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు, చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి

హైటెక్ ఫీచర్లతో స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు, చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి

National
ఇండియన్ రైల్వేస్.. ఎట్టకేలకు వందే భారత్ స్లీపర్ కోచ్‌ల (New Vande Bharat Trains With Sleeper Coaches) ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్లీపర్ కోచ్‌ల కాన్సెప్ట్ చిత్రాలను మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’( Koo)లో పంచుకున్నారు. ఈ కొత్త రైళ్లు 2024 నాటికి అందుబాటులోకి వస్తాయని, ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించనున్నాయి."వందే భారత్ ద్వారా కాన్సెప్ట్ రైలు (స్లీపర్ వెర్షన్) త్వరలో వస్తుంది... 2024 ప్రారంభంలో వస్తుంది’’ మంత్రి (Railway Minister, Ashwini Vaishnaw) కూలో రాశారు. వందే భారత్ స్లీపర్ కోచ్‌లలో విశాలమైన బెర్త్‌లు, ప్రకాశవంతమైన ఇంటీరియర్స్, విశాలమైన టాయిలెట్లు, మినీ ప్యాంట్రీ, అధునాతన భద్రతా ఫీచర్లతో సహా అనేక కొత్త ఫీచర్లు ఉంటాయి. కొత్త రైళ్లు ప్రస్తుత కోచ్‌ల కంటే ఎక్కువ ఇంధన-సమర్థవంతమైనవి, పర్యావరణ అనుకూలమైనవిగా ఉంటాయని భావిస్...
LPG price hike: భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర

LPG price hike: భారీగా పెరిగిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర

National
LPG price hike: వినియోగదారులకు చమురు కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. అక్టోబర్ 1, 2023 నుండి, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 209 పెరిగింది. ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ. 1,731.50కి విక్రయిస్తోంది.ఒక నెల క్రితం, ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించింది. అయితే, అక్టోబర్ 1 నాటికి దేశీయ ఎల్‌పిజి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో 14.20 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉంది. దీనికి విరుద్ధంగా, చమురు కంపెనీలు గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను సెప్టెంబర్ 2023లో తగ్గించాయి, ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,522కి పడిపోయింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఇటీవల పెంచడం వల్ల హోటల్ రెస్టారెంట్లలో భోజన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంస్థలు సాధారణంగా వంట కోసం వాణిజ్య గ్య...
vande bharat sleeper train : వచ్చే ఏడాది స్లీపర్ కోచ్ వందేభారత్ ట్రైన్ వస్తోంది..

vande bharat sleeper train : వచ్చే ఏడాది స్లీపర్ కోచ్ వందేభారత్ ట్రైన్ వస్తోంది..

National
vande bharat sleeper train : భారతీయ రైల్వే కొత్తగా వందే భారత్ స్లీపర్ రైలును తీసుకొస్తోంది. ఈ రైలు కొత్త డిజైన్‌తో తయారీకి సిద్ధంగా ఉందని అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. వందే భారత్ స్లీపర్ కోచ్‌ల కొత్త డిజైన్‌ను ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) తయారు చేస్తాయి. కాగా కొత్తగా రూపొందించిన స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలు ఫిబ్రవరి 2024 నాటికి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అవి రాత్రిపూట ఈ హై-స్పీడ్ రైళ్లు ఎక్కువ దూరం ఉన్న గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి అనువుగా ఉంటాయి. అత్యాధునిక హైటెక్ ఫీచర్లతో ఆకర్షణీయమైన లుక్ తో స్వదేశీ సెమీ-లైట్ స్పీడ్ రైలు ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందిస్తున్నాయి. అధిక వేగం, మెరుగైన భద్రత, మంచి సర్వీస్ కారణంగా వందేభారత్...
Ujjain minor rape case : నా కొడుకుకి మరణ శిక్ష విదించండి.. ఉజ్జయిని మైనర్ రేప్ కేసులో తండ్రి..

Ujjain minor rape case : నా కొడుకుకి మరణ శిక్ష విదించండి.. ఉజ్జయిని మైనర్ రేప్ కేసులో తండ్రి..

Crime, National
Ujjain minor rape case  మూడు రోజుల తర్వాత 12 సంవత్సరాల వయస్సు గల బాలిక గాయపడిన స్థితిలో నగర వీధుల్లో నడుస్తూ కనిపించిన మూడు రోజుల తర్వాత భరత్ సోనీని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలిందిఉజ్జయిని: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన నిందితుడి.. తండ్రి శుక్రవారం తన కుమారుడికి ఉరిశిక్ష విధించాలని కోరాడు.. మరోవైపు న్యాయవాదులు ఎవరూ కోర్టులో అతని తరపున వాదించకూడదని స్థానిక బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.ఈ కేసులో ఆటో రిక్షా డ్రైవర్ భరత్ సోనీని గురువారం అరెస్టు చేశారు."ఇది సిగ్గుమాలిన చర్య, నేను అతనిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లలేదు, నేను నా కొడుకు కోపం పోలీసు స్టేషన్‌కు గానీ కోర్టుకు గానీ వెళ్లను. నా కొడుకు నేరం చేసాడు, కాబట్టి అతన్ని ఉరితీయాలి" అని అతని తండ్రి ఇక్కడ విలేకరులతో అన్నారు.ఉజ్జయిని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్...