Tuesday, September 9Thank you for visiting

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు

Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు

National
Bharat Atta: పెరుగుతున్న గోధుమల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు దీపావళి వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళికి ముందు దేశవ్యాప్తంగా 'భారత్ అట్టా' బ్రాండ్ పేరుతో కిలోకు రూ. 27.50 రాయితీపై గోధుమ పిండిని విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 'భారత్ అట్టా'ని దేశంలోని 800 మొబైల్ వ్యాన్లు, 2,000 కంటే ఎక్కువ అవుట్ లెట్ల ద్వారా సహకార సంస్థలైన నాఫెడ్, ఎన్ సిసిఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా విక్రయించనున్నట్లు వెల్లడించింది. 'భారత్ అట్టా' రాయితీపై అందుబాటులో ఉంటుంది, కాగా గోదుమ పిండి ధర నాణ్యత, ప్రదేశాన్ని బట్టి ప్రస్తుతం మార్కెట్ ధర రూ. 36-70 లోపు ఉంటుంది. ప్రతిచోటా ఆటా ధరల స్థిరీకరణ నిధి పథకంలో భాగంగా కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో 18,000 టన్నుల 'భారత్ అట్టా'ని కిలోకు రూ. 29.50 చొప్పున ఈ సహకార సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా విక్రయించింది. 'భారత్ అట్టా' ను కు సంబంధించిన 100 మొబైల్ వ్...
IRCTC Rooms: రైల్వే స్టేషన్‌లోనే హోటల్‌ రూమ్‌ లాంటి గది, రూ.100తో బుక్‌ చేయొచ్చు

IRCTC Rooms: రైల్వే స్టేషన్‌లోనే హోటల్‌ రూమ్‌ లాంటి గది, రూ.100తో బుక్‌ చేయొచ్చు

National
 IRCTC Retiering Room Booking: మనదేశంలోని రైళ్లలో ప్రతీరోజు కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయానికుల కోసం ఇండియన్‌ రైల్వే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. అయితే.. రైలు ప్రయాణికులలో చాలా మందికి, భారతీయ రైల్వే శాఖ అందిస్తున్న చాలా వసతుల గురించి సరైన అవగాహన ఉండడం లేదు. మీరు, రైల్వే స్టేషన్‌లో ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి గానీ, కునుకు తీయడాని గానీ, లేదా స్టేషన్‌లోని రణగొణ ధ్వనుల నుంచి కాసేపు రెస్ట్ తీ కోసం ఒక గదిని కావాలనుకుంటే, హోటల్‌ రూమ్‌ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వేస్టేషన్లలోనే అలాంటి సదుపాయం అందుబాటులో ఉంది. అతి తక్కువ ఖర్చుతోనే హోటల్ రూంం వంటి గదిలో గడపొచ్చు. కేవలం రూ.100కే రూమ్‌ బుకింగ్‌ రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసే వారికి రైల్వే స్టేషన్‌లోనే బస కల్పించేందుకు హోటల్ తరహాలో గదులను IRC...
ED Officers Arrest | ఏసీబీ అధికారులకు చిక్కిన ఈడీ అధికారులు

ED Officers Arrest | ఏసీబీ అధికారులకు చిక్కిన ఈడీ అధికారులు

National
లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అరెస్ట్ ‌  ED Officers Arrest | లంచం తీసుకున్న ఆరోపణలపై ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ అయ్యారు. (ED Officers Arrest) ఒక కేసు ఆపేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.జైపూర్‌: లంచం తీసుకున్న ఆరోపణలతో ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టయ్యారు. (ED Officers Arrest) ఒక కేసును ఆపేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన ఈడీ అధికారులను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక చిట్ ఫండ్ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఈడీ అధికారులైన నావల్ కిశోర్ మీనా, బాబూలాల్ మీనా ఇద్దరూ.. రూ.15 లక్షలు అడిగారు. ఈడీ ఇన్‌స్పెక్టర్లు ఒక మధ్యవర్తి వ్యక్తి నుంచి ఆ డబ్బులు తీసుకుంటుండగా రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్రాప్‌ చేసి అరె...
Massive fire | డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 18 బస్సులు దగ్ధం

Massive fire | డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 18 బస్సులు దగ్ధం

National
 Massive fire | ఒక బస్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. (Massive fire) భారీగా అగ్నికీలలుపొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.బెంగళూరు: బస్‌ డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుసుకుంది. (Massive fire) దీంతో భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 18 బస్సులు కాలి బూడిదయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం వీరభద్ర నగర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్సు డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. డిపోలో నిలిచి ఉన్న బస్సుల్లో సుమారు 18 బస్సులు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైర్‌ సిబ్బంది 10 ఫైర్‌ ఇంజిన్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపు చేశారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని అగ్నిమాపక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గురులింగయ్య వెల్లడించారు. మంటల్లో కాలిన ప్రైవేట్‌ బస్సులకు మరమ్మతుల అక...
Ram Temple | శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణం.. వీడియో రిలీజ్‌ చేసిన ట్రస్ట్‌

Ram Temple | శరవేగంగా అయోధ్య రామమందిరం నిర్మాణం.. వీడియో రిలీజ్‌ చేసిన ట్రస్ట్‌

National
Ayodhya Ram Temple | భారతదేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya) లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని.. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి భక్తులకు శ్రీరామచంద్రుని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (Shri Ram Janmbhoomi Teerth Kshetra) ట్రస్ట్‌ ఇప్పటికే వెల్లడించింది. వచ్చే ఏడాది 2024 జనవరి 21-23 తేదీల్లో ఆలయ ప్రతిష్ఠాపనోత్సవం నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆలయ ట్రస్ట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.అయోధ్య లో రామమందిర నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధ...
మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల  గొంతుకోసి చంపిన అత్త

మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త

National
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తనను నిద్రపోనీయకుండా ఏకధాటిగా ఏడుస్తోందని విసుగు చెంది.. తన రెండేళ్ల మేనకోడలిని కొట్టింది. అంతటితో ఆగకుండా పసిపాప గొంతుకోసి చంపింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh) జబల్ పూర్ నగరంలోని హనుమంతల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో సోమవారం జరిగింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసినట్లు మంగళవారం తెలిపారు. బాధితుడు మహ్మద్ షకీల్ కుమార్తె మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిందని హనుమంతల్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఎం ద్వివేది తెలిపారు. కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా తప్పిపోయిన బాలిక గురించి ఎలాంటి క్లూ లభించలేదని ద్వివేది తెలిపారు.తరువాత, పోలీసులు ఆమె తండ్రి ఇంటిలో పసిబిడ్డ కోసం వెతకడం ప్రారంభించ...
పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి

పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి

National
అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ Jharkhand : ఇజ్రాయెల్‌తో యుద్ధం(Israel-Hamas war )లో హమాస్ హింసకు పాల్పడినట్లు ఆరోపించే వీడియోలను మంగళవారం ఒక మాజీ విద్యార్థి పాఠశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేసినట్లు పోలీసులు తెలిపారు. హింసకు సంబంధించిన గ్రాఫిక్ చిత్రాలే కాకుండా, రామ్‌ఘర్ (Ramgarh) పాఠశాల మాజీ విద్యార్థి పోర్న్ వీడియోలను కూడా షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్రప్పా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి హరి నందన్ సింగ్ మాట్లాడుతూ.. రామ్‌ఘర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని.. క్లాస్ టీచర్లు విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉండటానికి ఈ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారని తెలిపారు. ఎనిమిదో తరగతి సోషల్ మీడియా గ్రూప్( social media group) లో వచ్చిన ఈ వీడియోను వెంటనే తొలగించినట్లు చెప్పారు.సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వాట్సప్ గ్రూప్ (WhatsApp group) సెట్టింగ్‌లు మార్చేశ...
Train Accident: పట్టాలు తప్పిన రైలు.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు

Train Accident: పట్టాలు తప్పిన రైలు.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు

National
Bihar train accident : బీహార్‌లో బుధవారం నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (North East superfast train) పట్టాలు తప్పడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బక్సర్ పట్ణణం సమీపంలోని రఘునాథ్‌పూర్ స్టేషన్‌కు కొద్ది దూరంలో రాత్రి 9.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినస్ నుంచి బయలుదేరిన రైలు(రైలు నంబర్ 12506 ) అస్సాంలోని గౌహతి సమీపంలోని కామాఖ్యకు వెళ్తోంది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే మీడియాతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని చెప్పారు.రైలు ప్రమాదంలో (Train Accident) లో గాయపడిన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తాను బక్సర్, భోజ్‌పూర్ జిల్లాల విపత్తు నిర్వహణ శాఖ, ఆర...
Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..

Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..

National
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఈ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party (BJP), ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణించవచ్చు.ABP News- CVoter విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేయగా, రాజస్థాన్‌లో బీజేపీ కమలం అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. సర్వే(survey ) వివరాలను ఒకసారి చూడండి.. తెలంగాణ: ఒపీనియన్ పోల్ (opinion polls) ఆధారంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 119 సీట్ల అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేయగా, కాంగ్రెస్‌(congress)క...
 తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

 తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

National
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ Telangana Assembly Polls | న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది.. రాష్ట్ర శాసనసభకు నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ‌తోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 10 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. 13న స్క్రూట్నీ చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు నవంబరు 15 చివరి తేదీ. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేయనున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం 35,356 పోలి...