రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర

రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ఆర్మీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం

కార్గిల్ అమరవీరులకు ఘననివాళులర్పించేందుకు మహిళా సైనికాధికారుల  బృందం బైక్ ర్యాలీని చేపట్టింది.  కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాలైన సందర్భంగా ఢిల్లీ నుంచి గత మంగళవారం 25 మంది మహిళా బైకర్స్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రాస్‌కు బైక్ యాత్ర చేపట్టారు.

‘నారీ సశక్తికరణ్ మహిళా మోటార్‌సైకిల్ ర్యాలీ’ అనే పేరుతో  గత  మంగళవారం చేపట్టిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇక్కడి నేషనల్ వార్ మెమోరియల్ (NWM) నుంచి జెండా ఊపి ప్రారంభించారు. గురువారం ఈ యాత్ర జమ్ముకు చేరుకుంది.  జూలై 25న ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ముగియనున్న ఈ యాత్ర, 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాల జ్ఞాపకార్థం.. అలాగే మహిళల అలుపెరగని స్ఫూర్తిని చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ర్యాలీ సందర్భంగా, బృందం అనేక పాఠశాలల వద్ద ఆగి విద్యార్థులతో మాట్లాడింది. ఈ బృందం జమ్ములో పాఠశాలలను సందర్శించినప్పుడు విద్యార్థులనుంచి అపూర్వ స్వాగతం అందుకుంది.

READ MORE  Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఏముంది..?

అందరూ అధికారులే..

ఈ బృందంలో ఇద్దరు ‘వీర్ నారీలు’ ఉన్నారని, వారిలో వర్కింగ్ అఫిషియల్స్ , భారత ఆర్మీకి చెందిన 10 మంది మహిళా అధికారులు, ఎయిర్ ఫోర్స్, నేవీకి చెందిన ఒక్కొక్క మహిళా అధికారి, ఆర్మీకి చెందిన ముగ్గురు మహిళా సైనికులు, సాయుధ దళాల సిబ్బందికి చెందిన ఎనిమిది మంది ఉన్నారని PRO డిఫెన్స్ లెఫ్టినెంట్ కల్నల్ సునీల్ బర్త్వాల్ తెలిపారు. కార్గిల్ యుద్ధంలో భారత సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ బృందం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులర్పిస్తుంది.

24వ కార్గిల్ దివస్‌ను జరుపుకోవడానికి రక్షణ శాఖ చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం అని బైకర్స్ టీమ్‌లో పాల్గొన్న ఐశ్వర్య దేశాయ్ తెలిపారు. ఈ యాత్ర మహిళా సాధికారతకు ఉత్తమ ఉదాహరణ అని దేశాయ్ అన్నారు. ” అన్నీ సాధ్యమే.. మహిళకు ఉత్సాహం.. ధైర్యం ఉంటే, ఈ ప్రపంచంలో ఏదైనా సాధించకుండా ఆమెను ఏదీ ఆపదు” అని ఆమె పేర్కొన్నారు.

READ MORE  ఆరెంజ్ వందేభారత్ రైలు రంగు మార్పుపై క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి....అసలు కారణం ఇదే..

మరో బైకర్ నితీందర్ దత్ మాట్లాడుతూ “మనమందరం విజయ్ దివస్‌తో కనెక్ట్ అయ్యాము. ఆ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరచిపోకూడదు” అని అన్నారు.

12వ తరగతి చదువుతున్న యువనా శర్మ, మహిళా బైకర్లను స్వాగతించడం పట్ల తాను ఉప్పొంగిపోయానని, ఈ యాత్ర ఇక్కడి విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. “నేను ఈ మహిళా అధికారుల నుండి చాలా ప్రేరణ పొందాను. దేశానికి సేవ చేయడానికి నేను యూనిఫాం ధరించాలనుకుంటున్నాను” అని పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని గునికా గుప్తా అన్నారు.

ఈ “ధైర్యవంతులైన మహిళా బైకర్లకు” ఆతిథ్యం ఇవ్వగలగడం తమకు గొప్ప గౌరవమని పాఠశాల ప్రోగ్రాం ఇన్‌ఛార్జ్ ఆశు PTIకి తెలిపారు. ఈ ర్యాలీ కోసం ఆర్మీ TVS మోటార్‌తో ఒప్పందం కలిగి ఉంది.. ఇందులో పాల్గొనేవారు TVS రోనిన్ మోటార్‌బైక్‌లపై ప్రయాణించారు.

READ MORE  కాశ్మీర్ లోయలో అడుగుపెట్టిన అత్యాధునిక WhAP వాహనం

వెయ్యి కిలోమీటర్ల ర్యాలీ

మోటర్‌బైక్ యాత్ర దాదాపు 1,000 కి.మీ.లు సాగుతుంది, ఇందులో మహిళలు హర్యానా, పంజాబ్‌లోని మైదానాలు, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లోని ఎత్తైన పర్వత మార్గాల గుండా ప్రయాణించి ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌కి చేరుకుంటారు.

జూలై 26, 1999న, భారత సైన్యం కార్గిల్ యుద్దంతో అత్యున్నత పోరాట మటిమను ప్రదర్శించించి ప్రపంచానికి తన సత్తా చాటింది. కార్గిల్ మంచుతో నిండిన ఎత్తులలో, టైగర్ హిల్ వంటి ఎత్తైన ప్రదేశాలతో సహా దాదాపు మూడు నెలల సుదీర్ఘ యుద్ధం తర్వాత ఇండియా.. పాక్ అక్రమణదారులను తరిమికొట్టి ఘన విజయాన్ని సాధించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *