Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?

Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?

Nanded hospital news : మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 31మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 71 మంది ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Nanded hospital news : మహారాష్ట్ర నాందేడ్​ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు వరుసగా మృత్యువాతపడుతుండడం ఆందోళనకరంగా మారింది. తాజాగా.. మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి అధికారులు చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో.. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినవారి సంఖ్య 31కి చేరింది.

ఆస్పత్రిలో ఏం జరుగుతోంది.

నాందేడ్​లో ఉన్న డాక్టర్ శంకర్​రావ్​ చవాన్​ ప్రభుత్వ దవాఖానాలో సెప్టెంబరు 30- అక్టోబరు 1 మధ్యలో ఇక్కడ 24 మంది రోగులు చనిపోయినట్లు సోమవారం సాయంత్రం వార్త వెలుగులోకి వచ్చింది. 24 గంటల వ్యవధిలో 24మంది రోగులు మరణించడం సంచలనం రేపింది. ఈ 24 మందిలో 12 మంది శిశువులు కావడం అత్యంత విషాదకరం. మరో 12 మందిలో ఐదుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మృతుల్లో నలుగురు.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఓ వ్యక్తి విష పదార్థం తీసుకోవడంతో ఆస్పత్రిలో చేరాడు. ఒకరికి కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నాయి. మరో ఇద్దరు కిడ్నీ రోగులు ఉన్నారు. మూడు యాక్సిడెంట్​ కేసులు ఉన్నాయి.

READ MORE  పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి

Nanded hospital news today : ఇదిలా ఉండగా అక్టోబరు 1- 2 తేదీల మధ్యలో మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. అంటే.. 48 గంటల్లో 31మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మొత్తం 31 మందిలో 16 మంది పసికందులు- చిన్నారులు ఉన్నట్టు సమాచారం. “సెప్టెంబర్​ 30- అక్టోబరు​ 1 మధ్యలో 24 మంది మరణించారు. అక్టోబర్​ 1 నుంచి 2 మధ్యలో ఏడుగురు మృతి చెందారు. ఎవరూ ఆందోళన చెందవద్దు.. వైద్య నిపుణుల బృందం సిద్ధంగా ఉంది,” అని అధికారులు వెల్లడించారు.

READ MORE  Bengal Train Accident | పట్టాలు తప్పిన సికింద్రాబాద్ - షాలిమార్ ఎక్స్ ప్రెస్‌

అయితే ఈ ఘటనకు గల కారణాలపై స్పష్టత రావడం లేదు. ఔషధాల కొరత ఇందుకు కారణమని వార్తలు వచ్చాయి. కాగా వీటిని ఆసుపత్రి సిబ్బంది ఖండించింది. “ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వహించలేదు. కావలసినన్ని ఔషధాలు కూడా ఉన్నాయి. చికిత్స ఎంత అందించినా రోగులు రికవర్​ కావడం లేదు.” అని నాందేడ్​ ప్రభుత్వ ఆస్పత్రి డీన్​ శ్యామ్​రావ్​ వకోడే మీడియాకు వెల్లడించారు.

నాందేడ్​ ఆసుపత్రిలో రోగుల మృతి ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు ప్రభుత్వాధికారులు చెప్పారు. ముగ్గురు సభ్యుల బృందం దర్యాప్తు చేస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఓ నివేదిక సమర్పిస్తారని, అందులో కీలక విషయాలు బయటపడతాయని అధికారులు అంటున్నారు. మరోవైపు.. ఈ హాస్పిటల్ లోని మరో 71 మంది రోగుల ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం.

READ MORE  ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *