NABARD Office Attendant Recruitment | నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) NABARD ఆఫీస్ లలో అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహానిస్తూ అక్టోబర్ 2న బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్ చూడవచ్చు.
10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nabard.org నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు,
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) లో సబార్డినేట్ సర్వీస్‌లో గ్రూప్ ‘C’లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు అక్టోబర్ 2 బుధవారం నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 21 వరకు దరఖాస్తులకు తుది గడువు ఉంది. ఎంపికైన అభ్యర్థులు సుమారు రూ. 35,000 వేతనం పొందుతారు. దీంతోపాటు అదనపు ప్రయోజనాలు డెయిలీ అలవెన్స్ (DA), HRA వంటి అలవెన్సులను కూడా అందుకునే అవకాశం ఉంది.
నాబార్డ్ ఆఫీస్ కోసం ఎలా దరఖాస్తు తెలుసుకోండి..
NABARD Office Attendant Recruitment 2024
- NABARD అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న హైలైట్ చేసిన లింక్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
- New Login అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
- దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
- అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి
- Submitపై క్లిక్ చేయండి
- దరఖాస్తు రుసుము చెల్లించండి
- దీన్ని డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.
అర్హత ప్రమాణాలు
దరఖాస్తుదారులు వారు దరఖాస్తు చేస్తున్న రాష్ట్రం/ప్రాంతీయ కార్యాలయానికి అనుగుణంగా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం నుంచి 10వ తరగతి స్టాండర్డ్ (SSC/మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు పరిధి 18 నుంచి 30 సంవత్సరాలు, అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 2, 1994 మరియు అక్టోబర్ 1, 2006 మధ్య పుట్టినవారై ఉండాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..