N Convention | నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Telangana | హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (HYDRA) అధికారులు శనివారం ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna)కు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ (N Convention ) సెంటర్‌ను కూల్చివేశారు. తమ్మిడి కుంట సరస్సులోని ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో దీనిని నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి.
“హైడ్రా అధికారులు ఉదయమే ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేత సజావుగా జరిగేలా మేము పోలీసు బలగాలను మోహరించాము, ఈ భూమి ఎఫ్‌టిఎల్ జోన్‌లోకి వస్తుంది” అని మాదాపూర్ డిసిపి తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసే ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా కేసు కోర్టులో ఉండగా ఇలా అర్ధంతరంగా కూల్చివేయడం సమంజసం కాదన్నారు. చెరువు భూమికి ఒక్క అంగుళం కూడా అక్రమించలేదని స్పష్టం చేశారు. వెంటనే ఈ కూల్చివేతపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు చేశారు. శనివారం హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టులో స్టే ఆర్డర్ ఉండగా కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎన్ కన్వెన్షన్ ( N Convention ) ను కూల్చివేశారంటూ నాగార్జున తరపు న్యాయవాది హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.వినోద్‌కుమార్ విచారించారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను వెంటనే ఆపాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను పూర్తిగా కూల్చివేశారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..