
Uttar Pradesh Kanpur incident | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ స్టాల్‌లో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న కొందరు ముస్లిం వ్యాపారులు తమ మతపరమైన గుర్తింపును దాచిపెట్టిన విషయాన్ని భజరంగ్ దళ్ కార్యకర్తలు బట్టబయలు చేశారు. ఇద్దరు వ్యక్తులు తమ గుర్తింపును దాచిపెట్టేందుకు వారు ఏకంగా ‘జై శ్రీ రామ్’ అని రాసి ఉన్న టీ-షర్టును ధరించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలు స్నాక్స్ కొనడానికి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడి విక్రేతలు జై శ్రీరామ్ అని రాసి ఉన్న కాషాయ రంగు టీషర్టులు ధరించి ఉన్నారు. వారు హిందువులుగా భావించి తినుబండారాలను కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో వెజ్ కబాబ్‌లను తింటుండగా వారికి ఏదో రుచిలో తేడా అనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని పోలీసులు విచారించగా, వ్యాపారిని మహ్మద్ కల్లుగా గుర్తించారు.
విక్రేతలు హిందువులుగా నటిస్తూ కబాబ్‌లు, పరాఠాలను విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో భజరంగ్ దళ్ కార్యకర్తలకు, వీధి వ్యాపారులకు మధ్య జరిగిన ఘర్షణ గందరగోళానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరిస్థితిని తెలుసుకున్న బజరంగ్ దళ్ ప్రతినిధులు స్థానిక అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు, వెంటనే విక్రేత, దుకాణ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఉద్దేశపూర్వకంగా హిందూ కస్టమర్ల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా చేశారని ఆరోపించారు.
Alert Bajrang Dal workers caught a youth selling Food items by wearing Saffron clothes and hiding his identity by saying his name in kallu.
Turned out his name is Mohammed Kallupic.twitter.com/vw60McRBSo
— Megh Updates 🚨™ (@MeghUpdates) October 26, 2024