Moto G35 5G భారతదేశంలో ఈ రోజు లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 4GB LPDDR4x RAMతో కూడిన Unisoc T760 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.ఇది దుమ్ము, స్ప్లాష్ ను తట్టుకునేలా IP52 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఇందులో చూడవచ్చు. 6.72-అంగుళాల ఫుల్-HD+ LCD స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ముఖ్యంగా, Moto G35 5G మోడల్ ను మొదట్లో Moto G55 తో పాటు ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్‌లలో ఆగస్టులో ప్రవేశపెట్టారు. అయితే భారతదేశంలో Moto G55 లాంచ్ చేస్తారా లేదా అనే విషయాలను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.
భారతదేశంలో Moto G35 5G ధర
భారతదేశంలో మోటో G35 5G 4GB + 128GB వేరియంట్ ధర 9,999. ఇది దేశంలో ఫ్లిప్‌కార్ట్, అధికారిక మోటరోలా ఇండియా స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ జామ రెడ్, లీఫ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంది.
Moto G35 5G స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు
మోటో G35 స్మార్ట్ ఫోన్ 5G 120Hz రిఫ్రెష్ రేట్ తో 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.72-అంగుళాల ఫుల్-HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది విజన్ బూస్టర్, నైట్ విజన్ మోడ్‌కు మద్దతు ఇస్తుంది. హ్యాండ్‌సెట్ 4GB LPDDR4x RAM మరియు 128GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఉన్న Unisoc T760 SoC తో నడుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 హలో UI స్కిన్‌పై పనిచేస్తుంది.
ఇక ఇందులో కెమెరాల విషయానికొస్తే.. Moto G35 5G 50-మెగాపిక్సెల్ క్వాడ్-పిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ముందు కెమెరాలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
Motorola Moto G35 5Gలో డాల్బీ అట్మోస్-బ్యాక్డ్ స్టీరియో స్పీకర్‌లను చేర్చింది. ఇది దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP52-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. భద్రత కోసం, ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఇది యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, SAR సెన్సార్, ఇ-కంపాస్ సెన్సార్‌లు ఇందులో ఉన్నాయి.
మోటోరొలా G35 5G 20W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీని ఇందులో వినియోగించారు. హ్యాండ్‌సెట్ కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, A-GPS, LTEPP, GLONASS, గెలీలియో, QZSS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్ పరిమాణం 166.29 x 75.98 x 7.79mm మరియు బరువు 185g.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..