రూ.6 వేల‌కే Moto G04 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌..

రూ.6 వేల‌కే Moto G04 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌..

Moto G04 Price | తక్కువ ధరలో అవసరమైన అన్ని ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్అయింది.  మోటోరోలా కంపెనీ కొత్త‌గా Moto G04 బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది.  Moto G04 స్మార్ట్‌ఫోన్ 8GB వరకు RAM, 128GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజ్ తో వ‌స్తుంది. ఇది Unisoc చిప్‌సెట్ ద్వారా ప‌నిచేస్తుంది.

Moto G04 Price, కల‌ర్ ఆప్ష‌న్స్‌..

Moto G04 Price : కాంకర్డ్ బ్లాక్, శాటిన్ బ్లూ, సీ గ్రీన్ , సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది మోటోG04 భారతదేశంలో రూ. 4GB + 64GB కాన్ఫిగరేషన్ కోసం రూ.6,999 గా ఉంది. అలాగే 8GB + 128GB వేరియంట్ ధర రూ. 7,499గా నిర్ణ‌యించారు. కంపెనీ ప్రస్తుతం రూ. 64GB వేరియంట్ పై రూ.750 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఫ‌లితంగా దీని ధ‌ర రూ.6,249 ల‌కు త‌గ్గుతుంది. రిలయన్స్ జియో వినియోగదారులు, ప్రీ-పెయిడ్ ప్లాన్‌లో రూ. 399, రీచార్జ్ చేసుకుంటే.. క్యాష్‌బ్యాక్‌ను కూడా గెలుచుకోవచ్చు.

READ MORE  Jio AirFiber Plus offer: జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఉచితంగా మూడు రెట్ల స్పీడ్ తో ఇంటర్నెట్..

ఇది Flipkart, Motorola.in , ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12pm IST నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Moto G04 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Moto G04 Specifications : Motorola నుంచి వ‌చ్చిన బడ్జెట్ హ్యాండ్‌సెట్ 6.6-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్‌లు) IPS LCD స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 269ppi పిక్సెల్ డెన్సిటీ క‌లిగి ఉంటుంది. Moto G04 UniSoC T606 SoC ద్వారా Mali G57 GPUతో ప‌నిచేస్తుంది. 8GB RAMని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ My UXతో వ‌స్తుం ది.

READ MORE  Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా

కెమెరాల విష‌యానికొస్తే.. మోటో G04 సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. వెనుకవైపు LED ఫ్లాష్‌తో పాటు ఒకే 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.

ఇది ఎక్స్ ట‌ర్న‌ల్‌ మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించదగిన 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ తో వ‌స్తుంది. ఫోన్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP52 రేటింగ్‌తో కూడా క‌లిగి ఉంది. Moto G04 10W వైర్డు ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. హ్యాండ్‌సెట్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడి ఉంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. దీని బరువు 178.8g, పరిమాణం 163.49 x 74.53 x 7.99mm లో ఉంటుంది..

READ MORE  Jio AirFiber plans in 2023: నెలవారీ వార్షిక జియో ఎయిర్‌ఫైబర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధరలు, ఆఫర్‌లు ఫుల్ డీటెయిల్స్..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *