Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్ సీఎం ఎవరు.?
Most Popular Cm | దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిలిచారు. ఎక్స్ (ట్విటర్) ఖాతాలో దేశవ్యాప్తంగా మిగతా సీఎంల కంటే ఎక్కువ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు యోగీ. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మైలురాయిని దాటింది. యోగి తరువాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక వీరిద్దరి కంటే ముందు 24.8 మిలియన్ ఫాలోవర్లతో రాహుల్ గాంధీ ఉన్నారు.
భారత్ లో మోస్ట్ పాపులర్ సీఎంగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఘనతికెక్కారు. భారత్‌లో మిగతా సీఎంల కంటే అధికంగా ఎక్స్ ఖాతాలో ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటేసింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగి తర్వాత స్థానంలో నిలిచారు.
కేజ్రీవాల్ వ్యక్తిగత ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను 19.1 మిలియన్ మంది ఫాలో అవుతు న్నారు. యోగి వ్యక్తిగత అకౌంట్‌తో పాటూ ఆయన వ్యక్తిగత ఆఫీస్ అకౌంట్‌ను కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఫాలో అవుతున్నారు. కోటి మందికి పైగా యోగీ ఆఫీస్ ఖాతాను ఫాలో అవుతున్నారు. లా అండ్ ఆర్డర్ నిర్వహణలో సీఎం యోగి శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది. చట్టాలను ఉల్లంఘించే వారిని ఆయన అస్సలు ఉపేక్షించరని, వెనువెంటనే కఠిన చర్యలు తీసుకుంటారని చెబుతారు. ఈ తరహా పాలనకు యోగి స్టైల్ అని కూడా నామకరణం చేశారు. నేరగాళ్లు, గ్యాంస్టర్లను మట్టికరిపిచడంతో రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మరోవైపు, రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో చేసిన ఏర్పాట్లపై కూడా సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
👍👍👍👍