MMTS: వినాయక నిమజ్జనం వేళ ఎంఎంటీఎస్ శుభవార్త.. 17, 18వ తేదీల్లో రాత్రి కూడా ప్రత్యేక రైళ్లు
MMTS Special Trains : హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు ప్రజలకు నిర్విరామంగా సేవలందిస్తున్నాయి. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా రాత్రి నుంచి తెల్లవారుజూము వరకు కూడా ప్రత్యేక సర్వీస్ లను నడిపించేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. అయితే ప్రత్యేక సర్వీసులు రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు వినాయక నిమజ్జనాలు కూడా వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో భారీగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ప్రయాణికులు భారీగా పెరగనున్నందున ఆ రెండు రోజులు కూడా రాత్రి సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా నిమజ్జనకు నగరవాసులే కాదు.. సమీప జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఖైరతాబాద్‌లో భారీ వినాయకుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనాన్ని చూసేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ నిమజ్జనానికి నగరంలోకి ప్రైవేట్ వాహనాలు, ప్రత్యేక వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. నిమజ్జనాల సందర్భంగా నగరంలో భారీ ఊరేగింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిమజ్జనాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రి వేళల్లోనూ ఈ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులను నడుపుతామని ప్రకటించింది. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని.. తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోఉంటాయని వెల్లడించింది. తెలిపారు.
MMTS Special Trains (ప్రత్యేక రైళ్ల వివరాలు) :
- 17వ తేదీ మధ్యాహ్నం 23:10 గంటలకు హైదరాబాద్ నుంచి లింగంపల్లికి
- 17వ తేదీ మధ్యాహ్నం 23:50 గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్
- 18వ తేదీ ఉదయం 00:10 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా
హైదరాబాద్ నుంచి లింగంపల్లికి 18వ తేదీ ఉదయం 00:30 గంటలకు..
- 18వ తేదీ మధ్యాహ్నం 01:50 గంటలకు లింగంపల్లి నుంచి హైదరాబాద్
- 18వ తేదీ మధ్యాహ్నం 02:20 గంటలకు ఫలక్‌నుమా నుండి సికింద్రాబాద్‌కు.
- 18వ తేదీ మధ్యాహ్నం 03:30 గంటలకు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్
- 18వ తేదీ సాయంత్రం 04:00 గంటలకు సికింద్రాబాద్ నుండి హైదరాబాద్
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..