Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..

Vande Bharat Metro | జూలై నుంచి వందేభారత్ మెట్రో రైళ్ల ట్రయల్ రన్..

Vande Bharat Metro | న్యూఢిల్లీ: తక్కువ దూరం గల నగరాల మధ్య వందే మెట్రో అన్ రిజర్వ్ డ్  రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ జూలై 2024లో ప్రారంభం కానుంది. ఈ రైళ్లు దేశంలోని 124 నగరాలను కలుపుతూ 100-250 కి.మీల దూరా మధ్య పరుగులు పెట్టనున్నాయి. లక్నో-కాన్పూర్, ఆగ్రా-మథుర,  తిరుపతి-చెన్నై వంటి ఎంపిక చేసిన నగరాల మధ్య ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సమాచారం. రైళ్లు పెద్ద నగారాలు శాటిలైట్గ్ర నగరాల మధ్య ప్రయాణీకుకు రవాణా సౌకర్యం కోసం ఈ వందే భారత్ మెట్రో రైళ్లనుతీసుకువస్తున్నారు.  రైల్వే వర్గాల ప్రకారం, వందే మెట్రో ఒక విలక్షణమైన కోచ్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. ప్రతీ రైలులో  కనీసం 12 కోచ్‌లు ఉంటాయి. ప్రారంభంలో, కనీసం 12 వందే మెట్రో కోచ్‌లను ప్రవేశపెడతారు, రూట్ డిమాండ్ ఆధారంగా 16 కోచ్‌లకు విస్తరించే అవకాశం ఉంది.

READ MORE  దేశంలో అత్యంత డర్టీగా ఉండే రైళ్లు ఇవేనట..!

అన్ రిజర్వ్ డ్ ప్రయాణికులకు వరం..

నగరాల మధ్య రోజువారీ ప్రయాణాలు చేసేవారి కోసం ఈ అత్యాధునిక వందే భారత్ మెట్రో రైళ్లు (Vande Bharat Metro Trains) చక్కగా ఉపయోగపడుతాయి. అన్‌రిజర్వ్‌డ్ లేదా జనరల్ కేటగిరీ ప్రయాణికులకు అనువుగా ఉంాయి. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో ఒక్కో రైలుకు కోచ్‌ల సంఖ్యను పెంచే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. వందే మెట్రోతో పాటు, మే నెల ప్రారంభంలో సుదూర ప్రయాణాల కోసం రాత్రివేళ జర్నీ కోసం వందే స్లీపర్ రైళ్ల ట్రయల్స్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 పుష్-పుల్ వేరియంట్ అమృత్ భారత్ రైళ్లనునడపడంపై భారతీయ రైల్వే తన దృష్టి సారించింది. ఈ రైళ్లలో రోలింగ్ స్టాక్ ముందు, వెనుక భాగంలో ఒక్కో ఇంజన్ ఉంటుంది. “అమృత్ భారత్ కోన్ ఆకారపు ముక్కును కలిగి ఉంటుంది. యూరోపియన్ రైళ్లను పోలి ఉంటుంది. ఈ కొత్త అమృత్ భారత్ రైళ్లు 2026 నాటికి అందుబాటులోకి వస్తాయి” అని  అధికార వర్గాలు పేర్కొన్నాయి.

READ MORE  Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఏముంది..?

కాగా భారతదేశపు మొదటి సెమీ హై స్పీడ్ రైలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 2019లో భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రవేశపెట్టారు. మొదటి రైలు గరిష్టంగా 160 kmph వేగాన్ని అందుకోగలదు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో మధ్య దూరపు చైర్ కార్ వందే భారత్ రైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి. స్లీపర్ వేరియంట్ వందే భారత్ రైళ్లను రాబోయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రారంభించాలని యోచిస్తోంది. ఎక్కువ హాల్టింగ్స్ కలిగిన మెట్రో వందే భారత్ సేవలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.

READ MORE  ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భార‌త్

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *