Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు, 48 హెలిపోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్..
Air Taxi service : ఎయిర్ టాక్సీలతో ఇంటర్‌సిటీ డొమెస్టిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), డిజిటల్ స్కైతో ఢిల్లీ NCRలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ తో ఎయిర్ టాక్సీని ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఒకవేళ ఈ ఎయిర్ టాక్సీ అందుబాటులోకి వస్తే దేశంలో ప్రజా రవాణాగా సౌకర్యాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి నగరంగా ఢిల్లీ ఎన్‌సిఆర్ నిలవనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే పూర్తికాగా మొదట 6 రూట్లను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టును సాకారం చేసేందుకు అధికారులు ఎన్‌సీఆర్‌లో 48 హెలిప్యాడ్‌లను నిర్మించనున్నారు.
6 రూట్లు, 48 హెలిపోర్టులు
ఢిల్లీ ప్రాంతంలో పూర్తిగా సర్వే చేసిన తర్వాత మొత్తం 6 రూట్లను ఖరారు చేశారు. అవి ఇలా ఉన్నాయి.
- ఢిల్లీ నుంచి గురుగ్రామ్
- ఢిల్లీ నుంచి నోయిడా
- ఢిల్లీ నుంచి జేవార్ విమానాశ్రయం
- ఢిల్లీ నుంచి ఫరీదాబాద్
- ఢిల్లీ నుంచి మీరట్ విమానాశ్రయం
- ఢిల్లీ నుండి రోహిణి హెలిపోర్ట్
Air Taxi service : ఖరారు చేసిన మార్గాల్లో 48 హెలిపోర్ట్‌లలో 18 ఢిల్లీలో నిర్మించనున్నారు. గురుగ్రామ్‌లో 12, నోయిడాలో 10, గ్రేటర్ నోయిడాలో 4, ఫరీదాబాద్‌లో 2, ఘజియాబాద్‌లో 2 హెలిపోర్టులు నిర్మించనున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరగడం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున నిర్మాణ పనులు ఎన్నికల తర్వాత ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు రెండేళ్లు గడువును ఖరారు చేశారు.
నోయిడా, ఘజియాబాద్, ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్‌లకు ప్రతిరోజూ ప్రయాణించేవారికి కొత్తగా వస్తున్న ఎయిర్ టాక్సీ భారీ ఊరట కలిగించనుంది. ఢిల్లీ NCRలో అస్తవ్యస్తమైన ట్రాఫిక్ వ్యవస్థ, తరచూ ట్రాఫిక్ జామ్‌ల నుండి ఉపశమనం పొందుతారు. ఈ ప్రాజెక్ట్‌తో, ఢిల్లీ NCR నగరాల ప్రజలు తమ సమయాన్ని ఆదా చేస్తూ ప్రతిరోజూ 6-12 నిమిషాలు వెచ్చించడం ద్వారా ఎయిర్ టాక్సీ ద్వారా తమ గమ్యస్థానాలను సులభంగా చేరుకోగలుగుతారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
One thought on “Air Taxi service | ఢిల్లీ నగరవ్యాప్తంగా ఎయిర్ టాక్సీ సేవలు, మొత్తం ఆరు రూట్లు, 48 హెలిపోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్..”