Medaram Trains | మేడారానికి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రత్యేక రైళ్లు మీకోసమే.. టైమింగ్స్ ఇవే..

Medaram Trains | మేడారానికి వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్రత్యేక రైళ్లు మీకోసమే.. టైమింగ్స్ ఇవే..

Medaram Trains : మేడారం(Medaram) సమ్మక్క, సారక్క జాతరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆదివాసీలతోపాటు , తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సాధారణ భక్తులు కూడా లక్షలాదిగా తరలివస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులను (TS RTC) నడిపిస్తోంది. అలాగే వేలాదిగా ప్రైవేట్ వాహనానాల్లో అమ్మవార్ల దర్శనానికి వస్తున్నా.. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులు ఏమాత్రం రవాణా సౌకర్యాలు సరిపోవడం లేదు. మ‌రోవైపు హెలికాప్ట‌ర్ సేవ‌లు కూడా సిద్ధ‌మ‌య్యాయి. అయితే భక్తుల కోసం రైల్వేశాఖ ప్ర‌త్యేక రైళ్ల ను కూడా న‌డిపిస్తోంది. ఆవివ‌రాలేంటో ఇప్పుడు చూద్దాం..

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం (Medaram) స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధరణ ప్రజల కోసం 30 ప్రత్యేక జన్ సాదారణ్ రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్ర‌క‌టించారు. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట (Khajipet), వరంగల్ (Warangal) మీదుగా నడవనున్నాయి. సికింద్రాబాద్ (Secunderabad), నిజామాబాద్ (Nizamabad), ఆదిలాబాద్ (Adilabad), సిర్పూర్ కాగజ్ నగర్, ఖమ్మం (Khammam) నుంచి న‌డుస్తాయి. మేడారం జాతర చేరుకునేవారికి, తిరుగు ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతోనే స‌ర్వీసుల‌ను అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21వ తేదీ నుంచి 24 వరకు పైన పేర్కొన్న రైల్వే రూట్‌లలో నడవనున్నాయి. మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటుతో పాటు జాతర కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

READ MORE  దేశ ప్రజలందరికీ ఉపయోగపడే U-WIN Portal త్వరలో ప్రారంభం.. దీని ఫీచర్లు ఇవే..

ప్రత్యేక రైళ్ల సమయాలు

  • సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు తిరిగి వరంగల్ నుంచి సికింద్రాబాద్ మధ్య 10 రైళ్లు,
  • సిర్పూర్ కాగజ్ నగర్- వరంగల్, వరంగల్- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య 8 రైళ్లు,
  • నిజామాబాద్- వరంగల్, వరంగల్- నిజామాబాద్ మధ్య 8 రైళ్లు నడపనున్నారు.
  • అలాగే ఆదిలాబాద్-వరంగల్, వరంగల్-ఆదిలాబాద్ మధ్య 2, ఖమ్మం -వరంగల్, వరంగల్-ఖమ్మం మధ్య మరో రెండు రైళ్లు ప‌రుగులు పెట్ట‌నున్నాయి.

Medaram Trains : ఈనెల 21 నుంచి 25 వరకు సికింద్రాబాద్- వరంగల్ (07014) మధ్య, అదే సమయంలో వరంగల్‌-–సికింద్రాబాద్‌ (07015) మధ్య ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్‌కు సాయంత్రం 6:20 గంటలకు చేరుకుంటుంది.

READ MORE  Odisha | ప్రధాని మోదీకి గిరిజన మహిళ రూ.100 పంపించ‌డం వెనుక క‌థేంటి?

వరంగల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే (07023) వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు ఆదిలాబాద్‌ చేరుతుంది.
22వ తేదీ ఆదిలాబాద్ నుంచి వరంగల్ కు (07024) వెళ్లే ప్రత్యేక రైలు ఆదిలాబాద్ లో రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 గంటలకు వరంగల్‌ చేరుకుంటుంది.

23న ఖమ్మం నుంచి వరంగల్ (07021)కు వెళ్లే ప్రత్యేక రైలు ఖమ్మంలో ఉదయం 10గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:20 గంటలకు వరంగల్ కు చేరుకుంటుంది.

READ MORE  Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

24న వరంగల్ నుంచి ఖమ్మం (07022) వెళ్లే ప్రత్యేక రైలు వరంగల్‌లో మధ్యాహ్నం 1:55కు బయలుదేరి ఖమ్మంకి సాయంత్రం 4:30 గంటలకు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *