Monday, April 7Welcome to Vandebhaarath

ఎట్టకేలకు ఊపందుకుంటున్న మణుగూరు-రామగుండం రైల్వే లైన్ పనులు

Spread the love

Manugur to Ramagundam Railway Line : తెలంగాణ‌లో ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న మణుగూరు-రామగుండం రైల్వే లైన్ ప్రాజెక్టుపై క‌ద‌లిక వచ్చింది. ఈ కొత్త బ్రాడ్‌గేజ్ రైలు మార్గానికి సంబంధించిన పనులు వేగవంతం కానున్నాయి. రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులకు కాంపిటెంట్ అథారిటీ విధులు నిర్వర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం భూపాలపల్లి సబ్ కలెక్టర్ కాటారం, రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాలపల్లి, పెద్దపల్లి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భూసేకరణ ప్రక్రియను నిర్వహించే వీలు క‌లిగింది కాటారం సబ్‌కలెక్టర్‌ మల్హర్‌రావు, కాటారం మండలాల్లో భూసేకరణను చూస్తారని, భూపాలపల్లి జిల్లాలోని ఘన్‌పూర్‌, భూల్‌పల్లి మండలాల్లో భూపాలపల్లి ఆర్‌డీవో పర్యవేక్షిస్తారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం, మంథని, రామగిరి, కమాన్‌పూర్‌, పెద్దపల్లి మండలాల్లో భూసేకరణను అదనపు కలెక్టర్‌ చూస్తారు.

కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ప‌ట్ణ‌ణాల‌ను ఈ రైల్వే లైన్ క‌లుపుతుంది. ఈ రైల్వే లైన్ విస్తీర్ణం. 207.80 కిలోమీటర్లు ఉంటుంది. కోల్‌ కారిడార్‌గా పిలిచే ఈ రైల్వే లైన్‌ తెలంగాణలోని కోల్‌ బెల్ట్‌ ప్రాంతాలను దేశవ్యాప్తంగా పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానం చేయడంతో కీలక సరఫరా గొలుసుగా ఉపయోగపడుతుంది.

READ MORE  Central Government Scheme | నెలకు రూ. 30,000 ఇస్తున్న మోదీ .. దరఖాస్తు ఇలా చేసుకోండి..!

ఈ లైను నిర్మాణం పూర్తయితే తాడ్వాయి మీదుగా రైలు మార్గం అందుబాటులోకి వ‌స్తుంది. ఫలితంగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర అయిన‌ ములుగు జిల్లా మేడారం వద్ద సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకోవడం మరింత సులభతరమ‌వుతుంది. మ‌రోవైపు ములుగు, భూపాలపల్లి జిల్లాలకు రైలు కనెక్టివిటీని అందుబాటులోకి వ‌స్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగం పుంజుకుంటుంది.

ద‌శాబ్దాలుగా ఎదురుచూపులు

Manugur to Ramagundam Railway Line : కాగా రైల్వే ప్రాజెక్టు 1999లో ప్రతిపాదించగా, ఎట్ట‌కేల‌కు ద‌శాబ్దాల త‌ర్వాత క‌ద‌లివ‌చ్చింది. కేంద్రం ఈ ప్రాజెక్టుపై పునరాలోచన చేసి 2013-14 సంవత్సరంలో తొలివిడతగా రూ. 1,112 కోట్లు అంచ‌నా వేయ‌గా, ప్రాజెక్ట్ సవరించిన వ్యయం రూ. 3600 కోట్లు.

READ MORE  RSS New Office | ఢిల్లీలో అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైన RSS కొత్త కార్యాల‌యం

కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోటగుళ్లు, లక్నవరం, బొగత జలపాతం వంటి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కూడా కొత్త రైలు మార్గం సహాయపడుతుంది. ఛత్తీస్‌గఢ్ , ఒడిశాలోని మైనింగ్, పారిశ్రామిక ప్రాంతాలకు కనెక్టివిటీని అందించడంతోపాటు అంతర్గత గిరిజన ప్రాంతాలను కలుపుతూ కొత్తగూడెంను ఒడిశాలోని మల్కన్‌గిరితో కలుపుతూ రైల్వే లైను వేయాలని కేంద్రం ఆలోచిస్తోంది.

 

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

READ MORE  Yogi Adityanath | నేపాల్‌లో యోగి ఆదిత్యనాథ్ పై అకస్మాత్తుగా చర్చ ఎందుకు వచ్చింది..? ఖాట్మండులో వీధుల్లోకి జనం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *