మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు
Manipur Shocking incident : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక ఘటనలో కీలక నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించి ఉన్నాడు.
ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మణిపూర్ రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ప్రధాని మోదీ తీవ్రంగా స్పంచారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయం దేశానికే సిగ్గుచేటని అన్నారు. అమానవీయ ఘటనకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ స్పందిస్తూ ప్రభుత్వం నిందితులకు “మరణశిక్ష” విధించే విషయాన్ని పరిశీలిస్తోందని అన్నారు.
నిందితులపై పోలీసులు కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య కేసును నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, నిందితులను అరెస్టు చేయడానికి 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మణిపూర్ మహిళలు నగ్నంగా ఊరేగింపు, ఒక సామూహిక అత్యాచారం పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. సంఘటన జరిగిన రోజు సుమారు 800 నుండి 1,000 మంది వ్యక్తులు అత్యాధునిక ఆయుధాలతో బి.ఫైనోమ్ గ్రామంలోకి ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేసి, దోచుకున్నారు. ఇళ్లను తగులబెట్టారు. దుండగులు మైటీ సంస్థలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు.
దాడి సమయంలో, ఐదుగురు గ్రామస్థులు.. ఇద్దరు పురుషులు ముగ్గురు మహిళలు అడవికి పారిపోయారు. తరువాత వారిని నాంగ్‌పోక్ సెక్మై పోలీసు బృందం రక్షించింది. వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళుతుండగా సాయుధ గుంపు వారి నుంచి లాక్కెళ్ళారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న విధంగా ఆ గుంపు ఒకరిని తక్షణమే చంపి, ముగ్గురు మహిళలను బట్టలు విప్పమని బలవంతం చేసింది. వారిలో ఒకరు( 21), దారుణంగా సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆమెను రక్షించేందుకు సోదరుడు(19) ప్రయత్నించగా అతడిని హత్యచేశారు.
ఈ ఘటనను “అమానవీయమైనది” అని పేర్కొన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, తాను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌తో మాట్లాడానని, “ప్రస్తుతం దర్యాప్తు
జరుగుతోందని” “నేరస్తులను న్యాయస్థానం ముందుంచేందుకు ఎటువంటి ప్రయత్నాన్ని విడిచిపెట్టబోము” అని అన్నారు.
ట్విట్టర్‌కి కేంద్రం ఆర్డర్
బుధవారం ఇంటర్నెట్‌లో కనిపించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోనుషేర్ చేయవద్దని కేంద్రం ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు
జారీ చేసింది. ఈ వీడియోపై అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి, ఎలాంటి ఆలస్యం చేయకుండా అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని మణిపూర్‌కు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
😭😭