
Malakpet railway station | అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) లో భాగంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ లో పునరాభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఈ స్టేషన్ లో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పునరాభివృద్ధి పనులు 70% వరకు చేరుకున్నాయి. మలక్ పేట్ రైల్వే స్టేషన్ లో ఆధునిక సౌకర్యాలు, మెట్రో ఇంటిగ్రేషన్, పర్యావరణ అనుకూల డిజైన్‌తో, రూ.36.44 కోట్లతో మలక్‌పేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి 2025 చివరి నాటికి పూర్తి చేసి సిద్ధం చేసి వినియోగించుకునేలా చేయాలని దక్షిణమధ్య రైల్వే (South Central Railway) అధికారులు యోచిస్తున్నారు. ఇది పాతబస్తీ నగర ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించనుంది.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్..
రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) యొక్క సనయా భారత్ నయా స్టేషన్’ చొరవలో భాగంగా రూ.36.44 కోట్ల అంచనా వ్యయంతో మలక్ పేట స్టేషన్ పునరాభివృద్ధిపనులు చేపడుతోంది. ఇప్పటివరకు దాదాపు 70 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. పునరాభివృద్ధి చెందిన మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికుల కోసం అవాంఛిత నిర్మాణాలను తొలగించడం, మెరుగైన లైటింగ్, మెరుగైన యుటిలిటీ, కారిడార్ ఏరియా, అప్‌గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలం, దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి పర్యావరణ అనుకూల భవనంగా తీర్చదిద్దడం వంటి పనులు చేపడుతున్నారు.
Malakpet railway station : ఏయే అభివృద్ధి పనులు చేపడుతున్నారు..?
ఈ రైల్వే స్టేషన్ ఆధునిక నిర్మాణ శైలి, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయబడుతోంది. దీర్ఘకాలిక ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని తీర్చదిద్దుతున్నారు. పాతబస్తీలో అత్యంత కీలకంగా ఉన్న ఈ స్టేషన్, కాచిగూడ-ఫలక్‌నుమా సబర్బన్ మార్గంలో వస్తుంది. మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, చుట్టుపక్కల ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది.
ఈ స్టేషన్‌లో కాచిగూడ-కర్నూలు తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్ వంటి ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాప్‌లు కూడా ఉన్నాయి. అభివృద్ధి పూర్తయిన తర్వాత, మరిన్ని రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ పునరాభివృద్ధిలో కొత్త ముఖభాగం, రెండవ ప్రవేశద్వారం వద్ద స్టేషన్ భవనం అభివృద్ధి, సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా 12 మీటర్ల ఫుట్-ఓవర్-బ్రిడ్జి (FOB), రూఫ్ ప్లాజా, మెట్రో కనెక్టివిటీతో అనుసంధానం, ప్యాసింజర్ లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫారమ్, వెయిటింగ్ హాళ్లు, VIP లాంజ్, దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్ల, కొత్త సూచిక బోర్డులు, కొత్త ఫర్నిచర్ వంటివి ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు.
మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులు
- ప్రధాన సౌకర్యాలు
- ఆధునిక ముఖభాగం (ఫసాడ్)
- రెండవ ప్రవేశ ద్వారం
- 12 మీటర్ల ఫుట్-ఓవర్ బ్రిడ్జ్ (FOB)
- లిఫ్టులు, ఎస్కలేటర్లు
- రూఫ్ ప్లాజా
- VIP వెయిటింగ్ హాల్, లాంజ్
- దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్లు
- కొత్త సూచిక బోర్డులు, ఫర్నిచర్
- మెరుగైన లైటింగ్ & యుటిలిటీస్
- అప్‌గ్రేడ్ చేసిన పార్కింగ్ స్థలం
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.