Posted in

రూ.కోటి సొత్తు చోరీకి జ్యోతిష్యుడితో ‘శుభ ముహూర్తం’ ఫిక్స్ చేసుకున్న దొంగలు

maharashtra-baramati-robbers
Spread the love

చివరకు పోలీసులకు చిక్కిన ఐదుగురు నిందితులు

మహారాష్ట్రలోని బారామతిలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కొందరు దొంగలు ఓ ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తును దోచుకునేందుకు నిర్ణయించుకున్నారు. అది కూడా శుభ మహూర్తంలో చేయాలనుకునున్నారు. ఈ క్రమంలో ఆ దొంగల బృందం ఓ జ్యోతిష్యుడిని సంప్రదించి అతడికి ఫీజుగా రూ.8 లక్షలు చెల్లించింది.
అయితే అదృష్టం కలిసిరాకపోవడంతో చోరీ జరిగిన నాలుగు నెలల తర్వాత దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పెంపించివేశారు. వారి వద్ద నుంచి రూ.76లక్షల విలువైన బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నాలుగు నెలల క్రితం అంటే ఏప్రిల్ 21న బారామతిలోని దేవకట్ నగర్ ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. నిందితులను సచిన్ అశోక్ జగ్ధానే, రైబా తానాజీ చవాన్, రవీంద్ర శివాజీ భోంస్లే, దుర్యోధన్ ధనాజీ జాదవ్, నితిన్ అర్జున్ మోరేగా గుర్తించారు. వీరంతా కూలీ కార్మికులు” అని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ గోయల్ తెలిపారు.
సాగర్ గోఫనే అనే వ్యక్తి ఇంట్లో బంగారం, నగదు, విలువైన వస్తువులు ఉన్నట్లు నిందితులకు సమాచారం అందింది. అనంతరం దోపిడీకి ప్లాన్‌ రచించారు. ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే, వారు ఒక జ్యోతిష్యుడు రామచంద్ర చవాన్‌ను సంప్రదించి, తమ చోరీ ప్లాన్ ను అమలు చేయడానికి అనుకూలమైన సమయాన్ని (ముహూర్తం) నిర్ణయించడానికి రూ.8 లక్షలు చెల్లించారు.

ఎంచుకున్న సమయం ప్రకారం ఏప్రిల్ 21న సాగర్ ఇంట్లో లేని సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి భార్య త్రిప్తిపై దారుణంగా దాడి చేశారు. నిందితులు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి కొట్టి, రూ.95 లక్షల నగదు, రూ.11 లక్షలకుపైగా బంగారం, మొబైల్ ఫోన్లతో ఇంట్లో నుంచి పరారయ్యారు. కోటి రూపాయల విలువైన నగదు, వస్తువులను నిందితులు ఎత్తుకెళ్లారు.

దోపిడీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కూడా ఈ ఘటనపై తక్షణ విచారణకు ఆదేశించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీలు, నిఘా విభాగం సహాయంతో పోలీసులు నిందితులందరినీ వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *