Monalisa | కుంభమేళాలో దండలు అమ్ముకునే అమ్మాయికి బంపర్ ఆఫర్..
Monalisa | మహాకుంభమేళా (Maha kumbh 2025 ) లో ఓ తేనె కళ్ల యువతి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగాగా సోషల్‌మీడియాలో ఇప్పుడు అమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఏదో సెలబ్రెటీయో.. ధనవంతుల బిడ్డనో కాదు.. అందాల భామ అసలే కాదు.. చామన ఛాయ రంగులో ఉండే సాధారణ అమ్మాయి మాత్రమే.. పూసల దండలు దండలు అమ్ముకుని కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ యువతి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా (Prayagraj Maha Kumbh ) లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఇందుకు కారణం కాటుక దిద్దిన అందమైన తేనే కళ్లు.. అమాయకమైన చూపులు.. అవే ఇప్పుడు ఆమెను సోషల్‌మీడియాలో ఫాలో అయ్యేలా చేసింది. అంతటితో ఆగకుండా ఆమెకు బాలీవుడ్ (Bollywood) నుంచి సినిమా ఆఫర్‌లు వస్తున్నాయి.
ఇంతకీ మహాకుంభమేళాలో ప్రత్యక్షమైన ఈ తేనె కళ్ల యువతి పేరు మోనాలిసా భోస్లే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈమె కుటుంబం కొన్ని తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవిస్తోంది. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా మోనాలిసా కూడా బాల్యం నుంచే పూసల దండలు విక్రయిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళాలోపూసల దండలు అమ్ముకోవడానికి మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వొచ్చింది. అక్కడే మోనాలిసాను చూసిన కొందరు ఫిదా అయ్యారు. ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆమె వెలుగులోకి వచ్చింది. ఆ ఫొటోలు చూసిన వారు కూడా మోనాలిసా అందానికి మంత్రముగ్ధులయ్యారు.
మోనాలిసాతో సెల్ఫీలు, ఆమెను ఫొటోలు, వీడియోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు, వ్లాగర్లు క్యూ కడుతున్నారు. ఆమె అందాన్ని పొగిడేస్తూ నెటిజన్లు సైతం ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈక్రమంలోనే మోనాలిసాకు బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోనాలిసా అమాయకత్వాన్ని చూసి ఫిదా అయ్యానని సనోజ్ మిశ్రా తెలిపారు. డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం మొనాలిసా వంటి అమ్మాయినే వెతుకుతున్నానని చెప్పారు. తన సినిమాలో రైతు కూతురి పాత్రలో నటించేందుకు మోనాలిసా సరిగ్గా సెట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ప్రయాగ్‌రాజ్‌లో మోనాలిసాను కలుస్తానని సనోజ్‌మిశ్రా చెప్పారు.
The most talked about topic in Kumbh Mela, Uttar Pradesh is this beautiful girl "Monalisa".
📹Kumbh Mela India pic.twitter.com/xNU8Uv4rx2— Suresh Kumar Jingar (@Sureshjaihind1) January 19, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.