Maha Kumbh Gram Tent City | మహాకుంభమేళాలో సకల సౌకర్యాలతో టెంట్ సిటీ..
Mahakumbh Mela 2025 : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభ మేళాను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో “మహా కుంభ్ గ్రామ్” పేరుతో భారీ ప్రీమియం టెంట్ సిటీ (Maha Kumbh Gram Tent City) ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విలాసవంతమైన సౌకర్యాలతో గొప్ప సాంస్కృతిక అనుభూతితో ఈ టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఐఆర్‌సిటిసి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని గౌరవించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. భక్తులు, పర్యాటకులందరికీ , సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తామని జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.
రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన కంపెనీ ఐఆర్‌సిటీసీ.. పర్యాటకుల కోసం ఆస్తా, భారత్ గౌరవ్ రైళ్లలో ఇప్పటి వరకు 6.5 లక్షల మంది ప్రయాణికులను విజయవంతంగా నిర్వహించింది. ఆ అనుభవంతో దేశవ్యాప్తంగా రైలు నెట్‌వర్క్‌లో భారీ-స్థాయిలో తీర్థయాత్రలు, విస్తృతమైన హాస్పిటాలిటీ సేవలలో ఎంతో నైపుణ్యం పెంచుకుంది. తాజాగా “IRCTC కుంభ్ గ్రామ్ ఏర్పాటుతో అసమానమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక గ్రామాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది.
‘మహా కుంభ్ గ్రామ్’ డేరా నగరం
IRCTC డైరెక్టర్ (పర్యాటకం & మార్కెటింగ్), రాహుల్ హిమాలియన్ మాట్లాడుతూ, “ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ గ్రామ్ టెంట్ సిటీ అతిథులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన డీలక్స్, ప్రీమియం క్యాంపులను అందిస్తుందని, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ప్రీమియం అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. మహాకుంభ్ 2025”. “అల్పాహారంతో సహా డబుల్ ఆక్యుపెన్సీపై ఒక రాత్రి బసకు రు. 6,000 నుండి టారిఫ్ ప్లాన్‌లు ప్రారంభమవుతుతాయని ఐఆర్సీటీసీ ప్రకటించింది. మరింత సమాచారం కోసం లేదా ప్యాకేజ్ బుక్ చేసుకోవడానికి irctctourism.com లేదా 1800110139లో కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించండి.
మహాకుంబ్ మేళా 2025 గురించి
దేశంలోనే అతిపెద్ద హైందవ ఉత్సవంగా మహాకుంభమేళాను పేర్కొంటారు. ప్రతి 3 సంవత్సరాలకు కుంభమేళా, ప్రతి 6 సంవత్సరాలకు.. అర్ధ కుంభమేళా, ప్రతీ 12 సంవత్సరాలకు మహా కుంభమేళా నిర్వహిస్తారు. చివరిగా 2013లో మహా కుంభమేళా నిర్వహించగా.. ఆ తర్వాత 2019లో అర్ధకుంభమేళా నిర్వహించారు. ఇప్పుడు 2025లో మహా కుంభమేళాకు అంతా సిద్ధమవుతోంది. మహా కుంభమేళా 2025 జనవరి 29, 2025న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సిద్ధి యోగాలో నిర్వహించనున్నారు.సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి ఇది అతి పెద్ద ఉత్సవం. ఈ పవిత్ర జాతరలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి సాధువులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. మహా కుంభమేళా సందర్భంగా ఈ పవిత్ర మహాసంగంలో అందరూ స్నానం చేయాలని కోరుకుంటారు. అందుకే దీనిని మహాసంగమం అని కూడా అంటారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభం జరగనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.