LPG Price Hike | భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు!
● గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 60, వాణిజ్య సిలిండర్‌పై రూ. 115 పెంపు
● నేటి నుంచే (మార్చి 7) అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
● ఇంధన కొరత లేదన్న కేంద్ర మంత్రి.. పుకార్లను నమ్మవద్దన్న ఇండియన్ ఆయిల్
LPG Price Hike | న్యూఢిల్లీ: సామాన్యుడి వంటింటి బడ్జెట్‌పై మరోసారి భారం పడింది. దేశవ్యాప్తంగా గృహ వినియోగ (LPG) సిలిండర్ల ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. శనివారం (మార్చి 7, 2026) నుండి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రామాణిక 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెరగగా, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 115 మేర పెరిగింది.
| నగరం | పాత ధర (రూ.) | కొత్త ధర (రూ.) | పెంపు |
| ఢిల్లీ | 853 | 913 | రూ. 60 |
| ముంబై | 852.50 | 912.50 | రూ. 60 |
| కోల్‌కతా | 879 | 939 | రూ. 60 |
| చెన్నై | 868.50 | 928.50 | రూ. 60 |
LPG Price Hike : వ్యాపారాలకూ సెగ.. వాణిజ్య గ్యాస్ ధరలు:
ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరలు ఇలా మారాయి:
- చెన్నై: రూ.1,929 నుంచి రూ.2,043.50కి
- ఢిల్లీ: రూ.1,768.50 నుంచి రూ.1,883కి
- ముంబై: రూ.1,720.50 నుంచి రూ.1,835కి
- కోల్‌కతా: రూ.1,875.50 నుంచి రూ.1,990కి
ఇంధన కొరత లేదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక ప్రకటన చేశారు. “భారతదేశంలో ఇంధన కొరత లేదు. మా పౌరులకు స్థిరమైన, సరసమైన ఇంధనాన్ని అందించడమే మా ప్రాధాన్యత. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ఆయన X (ట్విట్టర్) వేదికగా హామీ ఇచ్చారు.
పుకార్లను నమ్మకండి: ఇండియన్ ఆయిల్
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తీవ్రంగా ఖండించింది. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. సరఫరా, పంపిణీ నెట్‌వర్క్ సాధారణంగా పనిచేస్తోంది. బంకుల వద్ద రద్దీ చేసి ఆందోళన చెందవద్దని, కేవలం అధికారిక సమాచారాన్నే నమ్మాలని సంస్థ కోరింది. ప్రపంచ పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, అవసరమైతే ప్రత్యామ్నాయ దేశాల నుండి దిగుమతులు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

