Saturday, April 19Welcome to Vandebhaarath

Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది… 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..

Spread the love

Lok Sabha Elections 2024 | లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది…ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల పదవీకాలం కూడా జూన్‌తో ముగియనుంది. రానున్న ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు.

గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపింది. “12 రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి 1,000 పైన ఉంది. అంటే ఇక్క‌డ‌ పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. . 1.89 కొత్త ఓటర్లలో 85 లక్షల మంది మహిళలు. జనవరి 1న 18 ఏళ్లు నిండని వారి పేర్లను కూడా చేర్చాము. 2024, అడ్వాన్స్‌డ్ లిస్ట్‌లో.. 13.4 లక్షల ముందస్తు దరఖాస్తులు మా వద్దకు వచ్చాయి. ఏప్రిల్ 1లోపు 5 లక్షల మందికి పైగా ఓటర్లు అవుతారు” అని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

READ MORE  Elections 2024 : మీ ఓటర్ స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు

Loksabha Polls Schedule 2024 అన్ని పోలింగ్ బూత్‌లలో, ఓటర్ల సౌకర్యార్థం మరుగుదొడ్లు (మగ, ఆడ), తాగునీరు, ర్యాంపులు, వీల్‌చైర్లు వంటి సౌకర్యాలు ఉన్నాయని కమిషన్ తెలిపింది. 85 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు, అలాగే 40 శాతం లేదా అంతకంటే వైకల్యం ఉన్న దివ్యాంగ‌ ఓటర్లకు ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. . అదనంగా, పోలింగ్ స్టేషన్లు వాలంటీర్లు, వీల్‌చైర్లు, అర్హులైన ఓటర్లకు ఓటింగ్‌ను సులభతరం చేయడానికి రవాణా సహాయాన్ని అందిస్తాయి.

ప్రచారానికి పిల్లలను ఉపయోగించుకునే రాజకీయ పార్టీలపై EC చర్యలు తీసుకుంటుందని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. అక్రమ నిధుల ప్రవాహాన్ని అరికట్టడానికి, భారత ఎన్నికల సంఘం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో క్షుణ్ణంగా ప‌రిశీలిస్తుంద తెలిపారు.  మరోవైపు ఎన్నికల విధుల్లో వలంటీర్ల సేవలను వినియోగించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఎన్నికల విధులకు దూరంగా వలంటీర్లు ఉండాల్సిందేని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఎన్నికల్లో విధుల్లో ఉండకూడదని స్పష్టం చేసింది.

కేవైసీ యాప్ లో పూర్తి వివ‌రాలు..

పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్‌లో చూడవచ్చని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. అభ్యర్థి పూర్తి వివరాలను ప్రతి ఓటరూ తెలుసుకోవచ్చు. ఓటర్లకు తాయిలాలు, నగదు పంపిణీ చేసిన‌ట్లు గుర్తిస్తే. వెంట‌నే ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చు. సీ- విజిల్‌ యాప్‌ ద్వారా కూడా ఓటర్లు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

READ MORE  తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. వచ్చే నెలలోనే నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు

 దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్

Lok Sabha Elections 2024 : దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్
ఏప్రిల్ : 19 తొలిదశ ఎన్నికలు, : 26న రెండో దశ పోలింగ్, మే : 07 మూడో దశ పోలింగ్, మే : 13 నాలుగో దశ,
మే 20న ఐదో దశ, మే : 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ నిర్వహించనున్నారు.  జూన్‌ 4వ తేదీన  లోక్‌సభ ఎన్నికలతోపాటు  వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

  • ఏప్రిల్-18న ఏపీ ఎన్నికల నోటిఫికేషన్
  • ఏప్రిల్-25 నామినేషన్లకు చివరి తేది
  • ఏప్రిల్-26 నామినేషన్ స్క్రూటినీ
  • ఏప్రిల్-29కు నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ
  • జూన్-04న ఎన్నికల కౌంటింగ్

ఒడిశా ఎన్నికల షెడ్యూల్

ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగుతాయి.
ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు

  • మొదటి దశ:
  • నోటిఫికేషన్: ఏప్రిల్ 18
  • ఎన్నికల తేదీ: మే 13

రెండో దశ
నోటిఫికేషన్: ఏప్రిల్ 26
ఎన్నికల తేదీ: మే 20

READ MORE  Electric blanket | చలిని దూరం చేసే ఎలక్ట్రిక్ దుప్పట్లు.. అందమైన రంగులు, అందుబాటు ధరల్లోనే..

మూడో దశ
నోటిఫికేషన్: ఏప్రిల్ 29
ఎన్నికల తేదీ: మే 25

నాలుగో దశ
నోటిఫికేషన్: మే 7
ఎన్నికల తేదీ: జూన్ 1
కౌంటింగ్, ఫలితాలు: జూన్ 4

అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు
ఒకే దశలో రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాలకు ఎన్నికలు
నోటిఫికేషన్ : మార్చి 20
ఎన్నికల తేదీ: ఏప్రిల్ 19
కౌంటింగ్, ఫలితాలు: జూన్ 4

సిక్కిం ఎన్నకలు
సిక్కింలో ఒకే దశలో రాష్ట్రంలోని మొత్తం 32 స్థానాలు
నోటిఫికేషన్ : మార్చి 20
ఎన్నికల తేదీలు: ఏప్రిల్ 19
కౌంటింగ్, ఫలితాలు: జూన్ 4

భారతదేశంలోని ఓటర్ల సంఖ్య

  • 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు
  • 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు
  • 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు
  • 1.8 కోట్ల మంది మొదటి సారి ఓటర్లు
  • 88.4 లక్షల మంది వికలాంగులు
  • 19.1 లక్షల మంది సర్వీస్ ఎలక్టర్లు
  • 82 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు పైబడిన వారు
  • 48,000 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు
  • 19.74 కోట్ల మంది యువ ఓటర్లు (20-29 ఏళ్ల వారు)
  • వందేళ్లు దాటిన ఓట‌ర్లు 2 లక్షల 18 వేలు
  • 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే..మహిళా ఓటర్ల నిష్పత్తి ఎక్కువ

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *