Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది… 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..
Lok Sabha Elections 2024 | లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది...ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల పదవీకాలం కూడా జూన్‌తో ముగియనుంది. రానున్న ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు.గత కొన్నేళ్లుగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా పురుష ఓటర్లు 49.7 కోట్లు కాగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. 18-19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపింది. "12 రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి 1,000 పైన ఉంది. అంటే ఇక్...