LIC Jeevan Utsav plan: బీమాతో పాటు జీవితాంతం ఆదాయాన్నిచ్చే ఎల్ఐసీ కొత్త ప్లాన్
‘జీవన్ ఉత్సవ్’ పాలసీ గురించి తెలుసుకోండి..
LIC Jeevan Utsav plan: ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవలే ‘జీవన్ ఉత్సవ్’ పేరుతో సరి కొత్త బీమా పాలసీని తీసుకొచ్చింది. తక్కువ ప్రీమియం చెల్లింపు సంవత్సరాలతో, జీవిత కాల బీమా కవరేజ్ తో పాటు జీవితాంతం ఆదాయాన్ని ఇచ్చే ప్లాన్ ఇది. ఈ పాలసీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్
ఈ జీవన్ ఉత్సవ్ (LIC Jeevan Utsav plan) నాన్ లింక్డ్.. నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. ఈ ప్లాన్ లో ప్రీమియం చెల్లిస్తున్న సంవత్సరాల్లో కూడా గ్యారెంటీ అడిషన్స్ ఉంటాయి.. 90 రోజుల వయస్సు ఉన్న శిశువు నుంచి 65 ఏళ్ల సీనియర్ సిటిజన్ వరకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు.
ఒకవేళ మరణిస్తే..
ఈ ప్లాన్ తీసుకుంటే.. పాలసీదారుడికి జీవితాంతం పాలసీ కవరేజ్ లభిస్తుంది. పాలసీదారుడు మరణించిన సమయంలో బీమా చేసిన మొత్తాన్ని, గ్యారెంటీ అడిషన్స్ తో సహా నామినీకి చెల్లిస్తారు. ఈ ప్లాన్ లో మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు.
5 రైడర్స్..
ఈ ప్లాన్ తో 5 రైడర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.. వాటిలో పాలసీ తీసుకున్న వ్యక్తి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ లేదా LIC యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ను ఎంచుకోవచ్చు. అదనంగా.. LIC కొత్త టర్మ్ అస్యూరెన్స్ రైడర్, LIC కొత్త క్రిటికల్ ఇల్ నెస్ బెనిఫిట్ రైడర్, LIC ప్రీమియం మినహాయింపు బెనిఫిట్ రైడర్లను అర్హత, షరతులకు అనుగుణంగా తీసుకోవచ్చు. అయితే వీటికోసం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది..
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
ఈ ప్లాన్ వివరాలు ఇవే..
- ఇందులో జీవిత కాలం బీమా కవరేజ్ తో పాటు జీవితాంతం ఆదాయం అందిస్తుంది..
- ఈ ప్లాన్ లో కనీసం ఐదు సంవత్సరాలు పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 16ఏళ్ల పాటు చెల్లించుకోవచ్చు.
- ప్రతీ పాలసీ ఏడాది ముగిసిన తర్వాత బీమా చేసిన కనీసం మొత్తంలో ప్రతీ రూ.1000 కి రూ.40లను గ్యారెంటీ అడిషన్ గా జోడిస్తారు.
- ప్రీమియం చెల్లింపు సంవత్సరాలు ముగిసిన తర్వాత, పాలసీ దారుడికి రెగ్యులర్ ఇన్ కం(Regular Income), ఫ్లెక్సి ఇన్ కం (Flexi Income) అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
- రెగ్యులర్ ఇన్ కమ్ (Regular Income) ఆప్షన్ ను ఎంచుకుంటే.. 3 లేదా 6 సంవత్సరాల డిఫర్మెంట్ పీరియడ్ ముగిసిన తర్వాత ప్రతీ పాలసీ ఏడాది చివరలో ఇన్సూర్ చేసిన మొత్తంలో నుంచి 10% డబ్బును ఇస్తారు.
- ఫ్లెక్సి ఇన్కమ్ (Flexi Income) ఆప్షన్ ను ఎంచుకుంటే, డిఫర్మెంట్ పీరియడ్ ముగిసిన అనంతరం ప్రతీ పాలసీ చివరలో ఇన్సూర్ చేసిన మొత్తంలో నుంచి 10% డబ్బును బేసిక్ సమ్ కు కలుపుతారు. ఆ మొత్తాన్ని నిబంధనలకు లోబడి ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ మొత్తానికి ఎల్ఐసీ 5.5% వడ్డీ కూడా ఇస్తుంది.
- ఈ పాలసీపై పాలసీదారుడు రుణం కూడా తీసుకోవచ్చు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.