Saturday, April 19Welcome to Vandebhaarath

138 జంటల విడాకులను అడ్డుకున్న న్యాయవాది.కానీ, ఆయనకే విడాకులు ఇచ్చిన భార్య..!

Spread the love

ఆయన ఒక సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ సీనియర్‌ న్యాయవాది. తన 16 ఏళ్ల న్యాయవాద వృత్తిలో విడాకుల కోసం వచ్చిన జంటలకు నచ్చజెప్పి కలిసి జీవించేలా చేశారు. కానీ, విచిత్రంగా ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. ఆర్థిక పరిస్థితులు ఆయన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌ హైకోర్టులో ఓ వ్యక్తి 16 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. తన వృత్తిలో భాగంగా 138 జంటలు విడాకులు తీసుకోకుండా అడ్డుకున్నారు.

విడాకుల కేసు వేసిన భార్య

సదరు న్యాయవాది భార్య తనకు విడాకులు కావాలంటూ కేసు ఫైల్‌ చేసింది. అయితే, భర్త నుంచి విడాకులు తీసుకునేందుకు కారణాలు పేర్కొంది. విడాకుల కోసం వచ్చే జంటలను విడిపోకుండా ఆపడమేకాకుండా ఎలాంటి ఫీజులు తీసుకోవడంలేదని వివరించింది. ఏమాత్రం ఫీజులు తీసుకోకపోవడంతో ఉచితంగా న్యాయసేవలు అందించడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యారు. ఫలితంగా న్యాయవాది దంపతులిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు విడిగా ఉంటుండగా.. కోర్టులో కేసు పెట్టింది. వీరిద్దరికి ఒక కుమార్తె ఉంది. తల్లిదండ్రుల గొడవల్లో ‘లా’ చదవుతున్న సైతం ఇబ్బందులకు గురైంది. విడాకులు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆమె తన తల్లితోనే నివసించింది. విడాకులు మంజూరైన తర్వాత ఆ కుమార్తె మాత్రం తనకు తన తండ్రే రోల్‌ మోడల్‌ అని, ఆయనతోనే కలిసి ఉంటానని వెల్లడించింది. కోర్టు సైతం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించి తండ్రితో ఉండేందుకు అనుమతిచ్చింది. అయితే, న్యాయవాది నుంచి ఆమె భార్య ఎలాంటి భరణం తీసుకోలేదని తెలిసింది.

READ MORE  ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష 

ఫీజు ఎందుకు తీసుకోలేదు?

విడాకుల కేసుల్లో తనను ఆశ్రయించిన జంటల నుంచి ఎందుకు ఫీజు తీసుకోలేదని ప్రశ్నించగా విచిత్రమైన కారణం తెలిపారు. వాస్తవానికి న్యాయవాది కజిన్‌.. విడాకులు తీసుకున్నాడని తెలిపాడు. అప్పటి నుంచి ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఏ జంట విడాకుల కోసం వచ్చినా అందుకు అనుమతించొద్దని నిర్ణయించుకున్నానని, అప్పటి నుంచి విడాకులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. సుమారు 138 జంటలను ఒప్పించి విడాకులు తీసుకోకుండా ఆపగలిగానని, కానీ తాను భార్యను మాత్రం ఒప్పించలేకపోయానని ఆ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు తీసుకోకుండా చూసేవాడని, వారి నుంచి ఫీజులు కూడా తీసుకోకపోయేవాడనని, దాంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని పేర్కొన్నారు. తన భార్య ఇతర న్యాయవాదులను చూసి తనను పోల్చుకొని పేదవాడినని అనుకునేదని, ఈ క్రమంలో గొడవలు తలెత్తాయని వివరించారు.

READ MORE  Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్‌..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *