
Ladakh New Districts | కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ ను త్వరలో ఐదు జిల్లాలుగా విభజించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ‘X’ వేదికపై ఒక పోస్ట్‌లో కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా వెల్లడించారు. లడఖ్ ను- జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్ అనే జిల్లాలుగా విభజిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పరిపాలనను చేరువ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఐదు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు లడఖ్‌లో లేహ్, కార్గిల్‌తో కలిపి మొత్తం ఏడు జిల్లాలు ఏర్పడతాయి. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఉంది. ప్రస్తుతం, లడఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు ఉన్నాయి. భారతదేశంలోని అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో ఇదీ ఒకటి. అత్యంత కష్టతరమైన కొండ ప్రాంతాలు, ప్రతికూల వాతావరణం ఇక్కడ ఉంటుంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అట్టడుగు స్థాయికి చేరుకోవడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
కొత్తగా ఐదు జిల్లాలు (Ladakh New Districts) ఏర్పాటయ్యాక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, లడఖ్ అడ్మినిస్ట్రేషన్‌లోని అన్ని ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు సులువుగా చేరడంతోపాటు ఎక్కువ మంది ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. MHA తీసుకున్న ఈ ముఖ్యమైన నిర్ణయం లడఖ్ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది. ఐదు కొత్త జిల్లాల ఏర్పాటుకు “సూత్రప్రాయంగా ఆమోదం” ఇవ్వడంతో పాటు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రధాన కార్యాలయం, సరిహద్దులు, నిర్మాణం వంటి కీలక అంశాలను ఖరారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లడఖ్ అధికార యంత్రాంగాన్ని కోరింది. పోస్టుల సృష్టి, జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ఏదైనా ఇతర అంశాలు మూడు నెలల్లోగా దాని నివేదికను సమర్పించాలని సూచించింది. ఈ కమిటీ తుది నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ ఈ నివేదిక ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లడఖ్ ప్రజలకు అపారమైన అవకాశాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..