Wednesday, July 30Thank you for visiting

Kolkata Rape Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్

Spread the love

Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసులో సిబిఐ పెద్ద అడుగు వేసింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandeep Ghosh)ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం (సెప్టెంబర్ 14) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 23 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.

గతంలో ఆర్థిక అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు తాజాగా అత్యాచారం-హత్య కేసులో నిందితుడిగా కూడా అరెస్టు చేశారు. ఆర్‌జి కర్ రేప్ కేసు దర్యాప్తులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు మాయం చేసినట్లు ఆరోపణలపై సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజీత్ మండల్‌లను సిబిఐ అరెస్టు చేసింది. సందీప్‌ను ఆదివారం సీల్దా కోర్టులో హాజరుపరచనున్నారు.

సాక్ష్యాల తారుమారు

నివేదికల ప్రకారం, సందీప్ ఘోష్, కోల్‌కతా పోలీస్ ఎస్‌హెచ్‌ఓ ఇద్దరూ దర్యాప్తును ఆలస్యం చేయడంలో, సాక్ష్యాలను తారుమారు చేయడం ద్వారా న్యాయాన్ని అడ్డుకోవడంలో ప్రమేయం ఉన్నారని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఆర్థిక అవకతవకల కేసులో ఈ నెల ప్రారంభంలో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టు సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

సందీప్ ఘోష్ ను ప్రస్తుతం ప్రెసిడెన్సీ సెంట్రల్ జైలులోని ఒక ప్రత్యేక గదిలో ఉంచారు. ఈ వారం ప్రారంభంలో అతన్ని తీసుకువచ్చారు. సందీప్ ఘోష్‌ను సెప్టెంబర్ 2న సీబీఐ అరెస్ట్ చేసింది. క్యాంపస్‌లో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన తర్వాత కలకత్తా హైకోర్టు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

Kolkata Rape Murder Case : కాగా ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. హత్యకు ముందు ఆమెపై అత్యంత కిరాత‌కంగా అత్యాచారం చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా వైద్యులు సమ్మెకు దిగారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నిర‌స‌న‌లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *