Monday, August 4Thank you for visiting

Kishan Reddy | పేద‌ల ఇళ్ల‌ను కూల్చివేస్తే ఊరుకోం.. దమ్ముంటే ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి.

Spread the love

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్

Musi Beautification  | కాంగ్రెస్ స‌ర్కారు పేద‌ల ఇండ్ల‌ను అన్యాయంగా కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమ‌ని కేంద్ర‌మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్ రెడ్డి (kishan reddy) అన్నారు. బిజెపి (BJP) రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి 10 నెల‌లు కాక‌ముందే పేదల కాల‌నీపై కన్నేసి వారి ఇండ్లను కూల్చ‌డానికి కుట్ర ప‌న్నింద‌ని విమ‌ర్శించారు. ఇండ్ల కూల్చివేతల (Demolition ) తో నిరంకుశ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. ప్రజల ఆందోళనలు పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదేవిధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. పేదల ఇండ్లపై మార్కింగ్ చేసింది. చివ‌ర‌కు ప్రజల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ రావ‌డంతో వెనుకడుగు వేసింది.

ముందు డ్రైనేజీల‌ను బాగుచేయండి..

హైదరాబాద్ లోని 70 శాతం డ్రైనేజీ నీరంతా మూసీలో చేరుతోంది. ప్ర‌తీ వీధిలో డ్రైనేజీ సమస్య ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను పరిష్కరించకుండా.. లక్షా 50 వేల కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ (Musi Beautification ) పేరుతో అనాలోచితంగా చర్యలకు పాల్పడుతోంది. అందులో 50 వేల కోట్లతో పేదలకు ఇండ్లు నిర్మించాలి. పైపులైన్ల నిర్మాణం చేపట్టాలి. వరదల నుంచి ముప్పు నుంచి బయటపడేలా పరిష్కారం చూపాలి. మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి, ఆ తర్వాత బ్యూటిఫికేషన్ చేయాలి. హైడ్రా . అనేక చెరువుల్లో బడాబాబులు, పెద్దపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపారవేత్తలు ఫాంహౌస్ లు, ఎస్టేట్ల పేరుతో నిర్మాణాలు చేసుకున్నారు. ముందు వారిపై హైడ్రా ప్రతాపం చూపాలి. దమ్ముంటే అక్రమంగా నిర్మించుకున్న ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చండి. అని కిష‌న్ రెడ్డి స‌వాల్ విసిరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేయకుండా అవినీతి ఆరోపణలతో న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొంటోంద‌ని కిష‌న్‌రెడ్డి అన్నారు. తెలంగాణలోనూ హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఆర్జీ ట్యాక్స్‌, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నార‌ని విమ‌ర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కంపెనీల నుంచి వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

 

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *