Thursday, July 31Thank you for visiting

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

Spread the love

 

కేరళలోని తిరువనంతపురం ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తన కొడుకు చనిపోవడంతో మనస్తాపం చెందిన అతడి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

తిరువనంతపురంలోని పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షీజా బేగంకు భర్త, కొడుకు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సజిన్ మహమ్మద్ వయనాడ్‌లోని ఒక కళాశాలలో మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ చదువుతున్నాడు. కాగా గత మంగళవారం మధ్యాహ్నం అతని మోటార్‌సైకిల్‌ను జీపు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మహ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

కొడుకు తన కుమారుడి మృతదేహాన్ని స్వీకరించేందుకు షీజా బేగం భర్త, బంధువులు వాయనాడ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కొడుకును తలుచుకుంటూ మనస్తాపానికి గురైన తల్లి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.


క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మొత్తం కుటుంబాన్నే ఛిద్రం చేస్తాయి. ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే కింద ఉన్న నంబర్లకు కాల్ చేయండి..

[table id=12 /]

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *