అయ్యప్ప దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్‌..

అయ్యప్ప దీక్ష తీసుకున్న చర్చి ఫాదర్‌..

శబరిమల పుణ్యక్షేత్ర సందర్శన కోసం సేవకుడి లైసెన్స్‌ వదులుకున్న రెవరెండ్‌ మనోజ్‌

తిరువనంతపురం: ప్రసిద్ధ శబరిమల ఆలయాన్ని సందర్శించాలనుకున్న ఓ చర్చి ఫాదర్ (Christian pries)‌.. సేవకుడిగా తనకున్న లైసెన్సును (Church licence) వదులుకున్న ఘటన కేరళలోని (Kerala) తిరువనంతపురంలో చోటుచేసుకుంది. రెవరెండ్‌ మనోజ్‌ కేజీ అనే ఫాదర్ ఆంగ్లికన్ చర్చి ఆఫ్‌ ఇండియాలో (Anglican Church of India) పనిచేస్తున్నారు. ఆయన కేరళలోని ప్రసిద్ధ శబరిమల క్షేత్రాన్ని (Sabarimala Temple) సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఇతర స్వామి భక్తుల మాదిరిగానే ఆయన కూడా మండల దీక్ష స్వీకరించి కొనసాగిస్తున్నారు. న్నారు. సెప్టెంబరు 20న అయ్యప్ప స్వామిని దర్శించుకోనున్నారు. అయితే దీనిపై స్థానికంగా దుమారం రేగడంతో చర్చి సేవల నుంచి తప్పుకున్నారు.
మతాల కంటే దేవుడు అనే భావనకే తాను ప్రాధాన్యమిస్తానని ఇస్తానని మనోజ్‌ చెప్పారు. తన దీక్ష గురించి తెలిసి చర్చి వర్గాలు తనను వివరణ కోరాయని, దీంతో వారిచ్చిన ఐడీ కార్డు, లైసెన్సు తిరిగి ఇచ్చేశానని వెల్లడించారు. మతాచారాలకు అతీతమైన హిందూయిజంపై అవగాహన పెంచుకోవడమే తన ఉద్దేశమని మనోజ్‌ కేజీ తెలిపారు. చర్చిలో చేరింది కూడా ఈ ఆలోచనతోనే అని స్పష్టం చేశారు. ఈనెల 20న శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి ప్రణాళిక తయారు ‌ చేసుకుంటున్నాని పేర్కొన్నారు. కాగా చర్చి బాధ్యతలు తీసుకోక ముందు మనోజ్‌ సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్ గా పనిచేశారు.

READ MORE  Nipah Virus : కేరళలో 5 నిపా కేసులు.. కాంటాక్ట్ లిస్ట్‌లో 700 మంది, 77 మంది హై-రిస్క్

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *