APSRTC : కార్తీక మాసంలో భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ..

APSRTC : కార్తీక మాసంలో భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ..

ఒక్కరోజులోనే పంచారామ క్షేత్రాల దర్శనం

పవిత్ర కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే పంచ మహాపాతకాలు తొలగిపోతాయని నమ్మకం. మొక్కులు నెరవేరుతాయని విశ్వాసం. ఈక్రమంలో భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ భక్తుల కోసం గుంటూరు, విజయనగరం వంటి అనేక ప్రాంతాల నుంచి స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
హిందువులు కార్తీక మాసాన్ని పవిత్ర మాసంగా భావిస్తారు. శివకేశవులను అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు, ప్రధానంగా ఈ కార్తీకమాసంలో శివ పూజకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. నెల రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలకు మాత్రమే కాదు అన్ని శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలు భక్తులతో కోలాహలం ఉంటుంది. తెలుగు వారు ఈ పంచారామ క్షేత్రాలను దర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ .. పంచారామ క్షేత్రాలను సులభంగా దర్శించుకునేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భక్తులకు అందుబాటులో ఉండేలా గుంటూరు, విజయనగరం వంటి అనేక విభిన్న ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులను నడపడానికి.. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

READ MORE  Election Notification | ఏపీ, తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ

గుంటూరు

పంచారామ శైవ క్షేత్రాలకు APSRTC గుంటూరు 2 డిపో ప్రత్యేకంగా బస్సులను నడుపుతోంది. ఈ బస్సులు గుంటూరు బస్ స్టాండ్‌లో శనివారం (నవంబర్ 18) రాత్రి 9:15 గంటలకు, ఆదివారం (నవంబర్ 19) రాత్రి 9:15 గంటల కు బయలుదేరుతాయి. ఈ బస్సులు అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని దర్శించుకున్న తర్వాత రెండోరోజు ఉదయం 9గంటలకు గుంటూరుకు తిరుగుపయనమవుతాయి. ఈ బస్సులకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది. అల్ట్రా డీలక్స్ బస్సు రూ.1130, సూపర్ లగ్జరీకి రూ.1,180. భక్తులు ముందుగానే తమ టికెట్లను బుక్ చేసు కోవచ్చు.

READ MORE  Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

విజయనగరం నుంచి..

పంచారామ క్షేత్రాలను దర్శించుకునేందుకు గాను విజయనగరం నుంచి రెండు మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు APSRTC విజయనగరం డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు ఈ ప్యాకేజీలో అమరావతి, పాలకొల్లు, ద్రాక్షారామం, భీమవరం, సామర్ల కోట శివాలయాలను సందర్శించి తిరిగి స్వస్థలానికి చేరుకోవచ్చు. భక్తులు బృందంగా ఏర్పడి యాత్రకు వెళ్లాలనుకుంటే బస్సు మొత్తం బుక్ చేసుకుని ప్రశాంతంగా ప్రయాణించవచ్చు.
టూర్ ప్యాకేజీ బస్సు లు నవంబరు 19, 26 ఆదివారాలు, డిసెంబర్ 3, 10వ తేదీల్లో ప్రారంభమవుతాయి. ఈ సర్వీసుల కోసం ఎక్స్ ప్రెస్,. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
కాగా పంచారామ శైవ క్షేత్రాల్లో మొదటిది కుమార రామం. కాకినాడకు సమీపంలోని సామర్లకోటలో ఉంది. రెండో క్షేత్రం ద్రాక్షారంలోని భీమా రామం. మూడోది క్షీరారామం. పాలకొల్లులో ఉంది. నాలుగోది భీమవరంలోని సోమారామం. ఐదోవది అమరారామం. అమరావతిలో అమరలింగేశ్వరుడిగా శివయ్య భక్తులను అనుగ్రహిస్తున్నాడు..

READ MORE  Gold and Silver Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *