Posted in

Video | కర్ణాటకలో కరెంటు కోతలు.. ఆస్పత్రిలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతో రోగులకు చికిత్సలు వీడియోలు వైరల్..

Karnataka Power Cuts
Spread the love

Karnataka Power Cuts | కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా (Chitradurga district ) లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వైద్యుడు త‌న‌ మొబైల్ ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించి రోగికి చికిత్స చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ (BJP) విమ‌ర్శ‌లు గుప్పించింది. నివేదిక‌ల‌ప్ర‌కారం.. ఈ ప్రాంతం గత వారం రోజులుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇందుకు ఆసుపత్రి కూడా దీనికి మినహాయింపు కాదు.

Highlights

‘గృహజ్యోతి’ (Gruha Jyoti) కింద ఇంటింటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే అధికార కాంగ్రెస్ పథకంపై బిజెపి ‘Darkness Bhagya (చీకటి భాగ్య) అంటూ విమ‌ర్శించింది. సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరో ‘గ్యారంటీ’గా బీజేపీ దీనిని ‘చీకటి భాగ్య’గా పేర్కొంది. పార్టీ తన ‘X’ హ్యాండిల్‌లో వీడియోను కూడా షేర్ చేసింది. చిత్రదుర్గ జిల్లాలోని మొలకాల్మూరు తాలూకాలోని ఆసుపత్రిలో ఒక వైద్యుడు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగించి రోగికి చికిత్స చేస్తున్న వీడియోను వీడియో చూపిస్తుంది. అందులో మెడికల్ స్టోర్ లో సిబ్బంది కూడా త‌మ మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ సాయంతోనే రోగులకు మందులు ఇస్తుండ‌డం క‌నిపిస్తుంది.

Karnataka Power Cuts : ‘‘ఏడాది గ్యారెంటీ ‘చీకటి భాగ్య’ ఇది కర్నాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన కానుక, ఆఫీస్‌లో ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆసుపత్రులకు కూడా విద్యుత్‌ సరఫరా చేయలేని దుస్థితికి చేరుకుంది. ఖజానా ఖాళీగా ఉంది, కరెంటు లేదు ఇది ‘చొంబు’ ‘చిప్పు’ (కొబ్బరి చిప్ప) ప్రభుత్వం!
అని ఎద్దేవా చేసింది. కాగా గ‌తంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ‘చొంబు’ ప్రభుత్వంగా అభివర్ణించింది. దీనికి ప్రతీకారంగా సిద్ధరామయ్య పాలనను చిప్ప‌ ప్రభుత్వంగా అభివర్ణిస్తూ బిజెపి ప్ర‌తిదాడికి దిగింది.

 


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *