Pre Wedding shoot in Hospital : ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి
Pre Wedding shoot in Hospital | కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నిర్వహించడంపై పెద్ద దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వైద్యుడు డాక్టర్ అభిషేక్ తన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఏర్పాటు చేసుకున్నాడు.
వీడియోలో డాక్టర్ అభిషేక్ ఒక రోగికి శస్త్రచికిత్స చేయడం కనిపిస్తుంది. పక్కనే ఉన్న అతడి భాగస్వామి అతనికి సహాయం చేస్తుంది. వీడియో ముగింపులో ‘రోగి’ ఆపరేషన్ తర్వాత కూర్చున్నట్లు చూపిస్తుంది.
ప్రీ-వెడ్డింగ్ వీడియోను చిత్రీకరించేందుకు గాను ఆపరేషన్ థియేటర్‌లోకి కెమెరాలు, లైట్లు ఇతర పరికరాలతో పాటు చాలా మంది వ్యక్తులను తీసుకొచ్చారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వివాదం చెలరేగింది. విషయం తెలుసుకొన్న కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు.. బాధ్యుడైన డాక్టర్ అభిషేక్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశించారు.
“చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన డాక్టర్‌ని సర్వీసు నుండి తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగత పని కోసం కాదని . డాక్టర్ల నుండి ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని నేను సహించలేను” అని ఆరోగ్యశాఖ మంత్రి X లో ఒక పోస్ట్‌లో రాశాడు.
వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది సహా కాంట్రాక్టు ఉద్యోగులందరూ ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారమే విధులు నిర్వర్తించాలని, ప్రభుత్వంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తపడాలని సంబంధిత వైద్యులను, సిబ్బందిని ఇప్పటికే ఆదేశించాను. ఆసుపత్రులు.. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సామాన్యుల ఆరోగ్య సంరక్షణ కోసమేనని తెలుసుకుని విధి నిర్వహణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి అని పేర్కొన్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
🫢