UtterPradesh | ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఎక్స్ ప్రెస్ రైలును కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించేందుకు యత్నించారు. ఇందుకోసం పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచారు. ఇదే సమయంలో వస్తున్న ప్రయాగ్‌రాజ్-భివానీ కాళింది ఎక్స్‌ప్రెస్ ( Prayagraj – Bhiwani Kalindi Express) సిలిండర్ ను ఢీకొనగా అది పాక్షికంగా ధ్వంసమై పక్కకు జరగడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిని ‘రైలును పట్టాలు తప్పించే ప్రయత్నం’గా పోలీసులు పేర్కొన్నారు.
కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్ వద్ద కాళింది ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంతో గమ్యస్థానం వైపు వెళుతుండగా సిలిండర్‌ను ఢీకొట్టింది. ఎల్‌పిజి సిలిండర్‌ను పట్టాలపై ఉంచి కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్స్ బృందాన్ని పిలిపించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తోంది, ”అని సీనియర్ పోలీసు అధికారి పిటిఐకి తెలిపారు.
కాళింది ఎక్స్ ప్రెస్( Kalindi Express) “లోకో పైలట్ అనుమానాస్పద వస్తువును గుర్తించిన వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేక్‌లు వేశాడు. రైలు ఆగిపోయే ముందు సిలిండర్‌ను ఢీకొట్టింది, కానీ ఢీకొన్న ఫలితంగా, సిలిండర్ పట్టాల నుంచి దూరంగా కదిలింది, ”అన్నారాయన. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ కోసం పోలీసులు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో గత నెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. ఆగష్టు 17న, వారణాసి-అహ్మదాబాద్ సబర్మతి ఎక్స్‌ప్రెస్ యొక్క 22 కోచ్‌లు కాన్పూర్ సమీపంలో కూడా పట్టాలు తప్పాయి. ఇంజిన్ ఒక ‘వస్తువు’ను ఢీకొట్టడంతో, లోకో పైలట్ బండరాయి అని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..