UP Police Result 2024 | UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాన్ని ఎక్కడ తనిఖీ చేయాలి?
UP Police Bharti Exam Result 2024 : ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలను uppbpb.gov.inలో చూడవచ్చు. యూపీ పోలీస్ కానిస్టేబుల్ మొత్తం 60,244 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే.. అయితే మొత్తం 48 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 34 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొత్తం లక్షా 74 వేల 316 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష కటాఫ్ 214కి పెరిగింది. ఈ పరీక్షలు ఆగస్టు 23, 24, 25, 30, 31వ తేదీల్లో జరిగాయి. ఆ తర్వాత ఈ పరీక్ష ఫలితం కోసం అభ్యర్థులు వేచి చూస్తున్న తరుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. కాగా ఈ పరీక్ష ఫలితాలు ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి..
UP పోలీస్ కానిస్టేబుల్ ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి..
మీరు UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రాసి ఉంటే మీరు వాని ఫలితాలను UP పోలీస్, ఉత్తర ప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ బోర్డ్ (UPPRPB) uppbpb.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు. ముందుగా ఈ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తర్వాత మీరు “కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 రిజల్ట్స్ ” లింక్‌పై క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా తదుపరి ప్రాసెసింగ్ చేయవచ్చు. ఈ రెండు వివరాలను నమోదు చేసిన తర్వాత, మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ జాబితాను చూడవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు