Tuesday, March 31, 2026
Technology

వినూత్న ఫీచర్లతో ప్రీమియం JioPhone Prima 2

Spread the love

JioPhone Prima 2 | స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయ‌లేని దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగారుల కోసం రిల‌య‌న్స్ తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం మొబైల్ ఎక్స్ ప్రీరియ‌న్స్ ఇచ్చే కొత్త స్మార్ట్ ఫీచర్ ఫోన్ JioPhone Prima 2 ను విడుదల చేసింది. దాని సొగసైన, క‌ర్వ్ డిజైన్ తో ప్రైమా 2 సాంప్రదాయ ఫీచర్ ఫోన్‌కు భిన్నంగా క‌నిపిస్తుంది. వీడియో కాలింగ్ స‌పోర్ట్‌తో కూడిన జియో ఫోన్ ప్రైమా 2 అదనపు యాప్‌లు లేకుండా ముఖాముఖిగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.ఇది JioTV, JioSaavn, JioNews మరియు JioCinema వంటి Jio యాప్‌లతో పాటు YouTube, Facebook, Google వాయిస్ అసిస్టెంట్ వంటి ప్రముఖ స‌ర్వీస్‌ను అందిస్తుంది. ఈ డివైజ్ JioPay ద్వారా UPI చెల్లింపులను చేయ‌వ‌చ్చు. JioChat ద్వారా గ్రూప్ చాట్, వాయిస్ మెసేజింగ్, మీడియా షేరింగ్‌ను అందిస్తుంది.

స్మార్ట్ ఫీచ‌ర్లు

Prima 2 ఫీచ‌ర్ ఫోన్‌ KaiOSలో రన్ అవుతోంది. Qualcomm ప్రాసెసర్‌తో ఆధారితమైన ఈ ఫోన్ 512MB RAM, 4GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. 128GB వరకు ఎక్స్‌ట‌ర్న‌ల్‌ SD కార్డ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇది 2.4-అంగుళాల LCD స్క్రీన్, 2000 mAh బ్యాటరీ, డిజిటల్ సెల్ఫీ, వెనుక కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0 మరియు Wi-Fi కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఇందులో ఇంగ్లీష్ తో స‌హా 22 భారతీయ భాషలకు స‌పోర్ట్ ఇస్తుంది. కాగా జియో ఫోన్ ప్రైమా 2 అమేజాన్ లో ₹2700 ధరకు అందుబాటులో ఉంది.

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *