Israel – Palestine Conflict | ఇజ్రాయెల్, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య
Israel – Palestine Conflict: ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన పాత కక్షల వల్ల ఇరువైపులా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా రెండు దేశాల్లో కలిపి 532 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 3వేల మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున.. ఒక్కసారిగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల తో మాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ నగరాలపై మెరుపు దాడికి చేశారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఇలా అన్ని మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300మందికి పైగా మరణించారు. 1,500 మందికిపైగా గాయపడ్డారు.
కాగా హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి షాక్ కు గురైన ఇజ్రాయెల్ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 232 మంది చనిపోయారు. మరో 1700 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధంలో పలువురు భారతీయులు కూడా చిక్కుకుపోయారు. రాకెట్ కాల్పులు, సైరన్ శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తుతుండటంతో భారతీయ విద్యార్థులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.. ఈ క్రమంలో అప్రమత్తమైన భారతీయ రాయబార కార్యాలయం విద్యార్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. పలువురు విద్యార్థులను సమీపంలోని సురక్షిత షెల్టర్లకు తరలించింది.
ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్ పేరుతో..
కాగా ‘ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్’ పేరు తో ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులకు పాల్పడింది తామేనని హమాస్ ఇప్పటికే ప్రకటించింది. మొదటి 20 నిమిషాల్లోనే 5వేలకు పైగా రాకెట్లను ప్రయోగించామని వెల్లడించింది. ‘‘దేవుడి సాయంతో మేం ఈ సమస్య అంతటికీ ముగింపు పలకాలనుకుంటున్నాము. దీంతో జవాబుదారీతనం లేకుండా నిర్లక్ష్యం వహించడం ముగిసిందని శత్రువు అర్థం చేసుకుంటాడు’’ అని హమాస్ మిలిటెంట్ లీడర్ మొహమ్మద్ దీఫ్ ప్రకటించారు..
వీధుల్లోని పౌరులపైనా కాల్పులు!
Israel – Palestine Conflict మిలిటెంట్ల దాడి ప్రభావం పవిత్ర జెరూసలెం నగరంతోపాటు టెల్ అవీవ్, ఇజ్రాయెల్ దక్షిణ, మధ్య ప్రాంతాలపైన కూడా కనిపించింది. వందలాది మంది ప్రజలు భయంతో దుప్పట్లు, ఆహార పదార్థాలు చేతబట్టుకొని ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇజ్రాయెల్‌లో కి చొరబడిన ఉగ్రవాదులు వీధుల్లోని పౌరులపై కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
షార్ హనెగెవ్ ప్రాంతీయ కౌన్సిల్‌లోని ఓ పట్టణాన్ని రక్షించేందుకు ప్రయత్నించిన అక్కడి మేయర్ ఓఫిర్ లిబ్‌స్టెన్ ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.
One thought on “Israel – Palestine Conflict | ఇజ్రాయెల్, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య”