IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర
IRCTC New Packeges 2024 | భారతీయ రైల్వేలో భారత్ గౌరవ్ రైళ్లకు భారీగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సికింద్రాబాద్ నుంచి మరో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ రైలు యాత్రను ప్రకటించింది. తొమ్మిది రోజుల పాటు కొనసాగే జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్టు రైలు జూన్ 22న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం
ప్రారంభమవుతుంది.
తీర్థ యాత్రలు ఇవే..
- తిరువణ్ణామలై (అరుణాచలం),
- రామేశ్వరం,
- మధురై,
- కన్యాకుమారి,
- త్రివేండ్రం-, తిరుచ్చి,
- తంజావూరు
హాల్టింగ్ స్టేషన్లు..
ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు జ్యోతిర్లింగ (రామేశ్వరం) దర్శనం కోసం ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తూ , అదే సమయంలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను కూడా కవర్ చేస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ప్రయాణికులు మార్గ మధ్యంలో ఎక్కే/దిగే సౌకర్యాన్ని కల్పించిందని ఐఆర్‌సిటిసి వెల్లడింయింది,
8 రాత్రులు \ 9 రోజులు
IRCTC New Packeges 2024 : ఈ యాత్ర మొత్తం 8 రాత్రులు/9 రోజుల పాటు కొనసాగనుంది. ఈ రైలుతో వ్యక్తిగత ప్రణాళిక ద్వారా ప్రయాణికులకు ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు. సరైన రైలును ఎంచుకోవడం, వసతి, ఆహారం మొదలైన సంబంధిత ఏర్పాట్లలో ఉండే ఇబ్బందులు ఉండవు. ఇందులో అన్ని ప్రయాణ సౌకర్యాలు ఉంటాయి. రైలు, రోడ్డు రవాణాతో సహా, వసతి సౌకర్యం, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్ – ఆన్-బోర్డు, ఆఫ్-బోర్డ్ రెండూ), రైలులో ఉన్నత భద్రత, పబ్లిక్ అనౌన్స్ మెంట్ సౌకర్యం, ప్రయాణ భీమా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇంకా ఐఆర్ సీటిసీ టూర్ మేనేజర్ల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ రైలుకి వసూలు చేస్తున్న చార్జీలు ఒక్కొక్కరికి జిఎస్టి తో సహా ఎకానమీ కేటగిరీ (స్లీపర్)కు రూ .14,250, ప్రామాణిక వర్గం (3 ఏసీ) రూ . 21,900, కంఫర్ట్ కేటగిరీ (2 ఏసీ)కి రూ.28,450గా నిర్ణయించినట్లు ఐఆర్‌సిటిసి పేర్కొంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
వివరాలు
- పర్యటన : జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర
- వ్యవధి : 8 రాత్రులు/9 రోజులు, జూన్ 22 నుండి 30 వరకు.
- ప్రయాణం – సికింద్రాబాద్- తిరువణ్ణామలై (అరుణాచలం)- రామేశ్వరం-మధురై- కన్యాకుమారి- త్రివేండ్రం-తిరుచ్చి-తంజావూరు. – సికింద్రాబాద్.
- బోర్డింగ్/అలైన్ పాయింట్లు – సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మరియు రేణిగుంట.
టికెట్ల వివరాలు..
- ఎకానమీ (SL): రూ. 14250
- స్టాండర్డ్ (3AC): రూ. 21900
- కంఫర్ట్ (2AC): రూ. 28450
Glimpses of 19th Bharat Gaurav Tourist Train departed from Secunderabad today on a 9 Nights / 10 days pilgrimage tour to Puri – Konark – Gaya- Varanasi – Ayodhya
& Kashi @IR_BharatGaurav @IRCTCofficial pic.twitter.com/83pCQtWtUc— South Central Railway (@SCRailwayIndia) June 8, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
One thought on “IRCTC New Packeges 2024 | ప్రయాణికులకు అద్భుత అవకాశం.. తక్కువ ధరలో జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర”