ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారత్ లో iPhone 16, iPhone 16 Plus విడుదలయ్యే రోజు ఇదే..
iPhone 16 | ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. అమెరికా కాలిఫోర్నియాలో కుపెర్టినోలోని యాపిల్ పార్క్ లో గల స్టీవ్ జాబ్స్ థియేటర్లో ‘యాపిల్ ‘ఇట్స్ గ్లో టైమ్’ అనే ట్యాగ్ లైన్ తో ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఎప్పటి మాదిగానే ఈ ఏడాది జరగనున్న ఈ ఈవెంట్లో ఐఫోన్16 ఫోన్ ను విడుదల చేసే చాన్స్ ఉంది. యాపిల్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, ఏఐ-ఆధారిత యాపిల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లను ప్రకటించే అవకాశముంది. ఐవోఎస్ 18, ఐప్యాడ్ ఓఎస్ 18, మ్యాక్ ఓఎస్ సీక్వియా, వాచ్ ఓఎస్ 11తో పాటు ఇతర ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత యాపిల్ 16 ఫోన్లను కూడా విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లు ఆపిల్ ఇంటెలిజెన్స్ కు సపోర్ట్ చేసేలా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు మాత్రమే ఈ మార్పునుకు అనుకూలంగా ఉన్నాయి.
ఇక యాపిల్ 16 మోడల్ ఫోన్ల విషయానికి వస్తే.. స్క్రీన్ పరిమాణాలు స్వల్పంగా పెరగవచ్చు. ఐఫోన్ 16 బేసిక్ మోడల్లో కెమెరా సెటప్ కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. కెమెరాను కూడా కొత్త హంగులను చేర్చవచ్చు. జూమ్ కంట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా బటన్ ను చేర్చే చాన్స్ ఉండవచ్చు.
యాపిల్ స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడల్స్‌లోని మ్యూట్ బటన్‌ను యాక్షన్ బటన్‌తో భర్తీ చేస్తుందని తెలుస్తోంది. ఇది గత సంవత్సరం ఐఫోన్ 15 ప్రో మోడళ్లలో ప్రవేశపెట్టింది. కంపెనీ ఐఫోన్ 16 కి కొత్త ‘క్యాప్చర్’ బటన్‌ను కూడా జోడించవచ్చు, అది వీడియో రికార్డింగ్‌ని ప్రారంభించడానికి, జూమ్ ఇన్, అవుట్ చేయడానికి ఉపయోపడుతుంది. స్టాండర్డ్ iPhone 16 మోడల్ నలుపు, ఆకుపచ్చ, గులాబీ, నీలం మరియు తెలుపు అనే ఐదు రంగులలో వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఐఫోన్ 16 ప్రాసెసర్
Apple తన అన్ని iPhone 16 మోడళ్లలో అదే A18 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుందని నివేదికలు సూచించాయి, ఎందుకంటే ఈ పరికరాలన్నీ పరికరంలో AI పనులను చేస్తాయి. అయినప్పటికీ, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ప్రాసెసర్‌లను వాటి GPU పనితీరు ద్వారా ప్రో వేరియంట్‌ల నుంచి వేరు చేయవచ్చు.
మరోవైపు ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌కు ర్యామ్ బూస్ట్‌ను ఇస్తుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందున్న 6 జిబితో పోలిస్తే 8 జిబి ర్యామ్ ఉండనుంది.
iPhone 16 కెమెరా:
Apple Insider నివేదిక ప్రకారం, iPhone 16, iPhone 16 Plus గత సంవత్సరం అదే కెమెరా సెటప్‌తో వస్తాయి. ఇది f/1.6 ఎపర్చర్, 2x ఆప్టికల్ టెలిఫోటో జూమ్‌తో 48MP ప్రైమరీ షూటర్, 0.5x తో ద్ద తీయగల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15లో f/2.4కి బదులుగా f/2.2 ఎపర్చర్ తో అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ స్వల్పంగా అప్‌గ్రేడ్ చేయవచ్చు, అంటే కొత్త ఐఫోన్‌లు తక్కువ-కాంతిలో కూడా చక్కని ఫోటోగ్రఫీని అందిస్తాయని చెబుతున్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..