Internet facility | త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ .. ఈ మూడు గ్రామాలో తొలిసారి..
Telangana | కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులోకి తెచ్చి ఇంటర్నెట్ కనెక్షన్ల (Internet facility) ను ఏర్పాటు చేయనుంది. న్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు( Minister Sridhar Babu) పేర్కొన్నారు. కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్‌వర్క్‌ని విస్తరించి 20 ఎంబీ స్పీడ్ ఇంటర్‌నెట్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్, నారాయణపేట జిల్లా మద్దూరు గ్రామాలను ఫైలెట్ గా ఎంపిక చేసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో నెట్‌వర్క్ (Internet ) విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ ఫైలెట్ గ్రామాల్లో ప్రధానంగా కేబుల్ టీవీ సర్వీస్, కేబుల్ వర్చువల్ డెస్క్‌టాప్ కనెక్టివిటీ, 20 ఎంబీ అన్‌లిమిటెట్ ఇంటర్‌నెట్ కనెక్టివిటీ, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఇదిలా వుండగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ మూడు గ్రామాల్లో 360 డిగ్రీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించి సీసీ కెమెరాలు అమర్చుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రెండు నెలల్లో పైలెట్ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ ఎదురయ్యే సాంకేతికపరమైన సమస్యలను గుర్తించి , సమగ్రంగా అమలు చేస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..