Saturday, August 30Thank you for visiting

World

#international, #worldwide, #instagram, #travel #world #photography #art #india #fashion #usa #hiphop #business Global #online #artist #imun #uk #like #follow #news #education #lifestyle #africa #model #canada #dance #london USA

Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి!

Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి!

World
Israel War | లెబనాన్ రాజధాని బీరుట్‌ లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ చేప‌ట్టిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా (HeZbollah) అధినేత హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మృతి చెందిన‌ట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. 'ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్' విజయవంతమైంద‌ని ఇజ్రాయెల్ వార్ రూమ్ సైతం వెల్ల‌డించింది. అయితే, ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా (Hassan Nasrallah) మరణించాడన్న వార్తలను హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇప్ప‌టివ‌ర‌కు ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన తమ కాంటాక్ట్‌లో లేరని, ఆయన ఎక్కడున్నారు? ఆయ‌న ఆరోగ్య పరిస్థితి గురించి తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ బాంబుల వర్షం కురిపించాయి.ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాప...
దక్షిణ లెబనాన్‌లో పలువురు హిజ్బుల్లా కమాండర్లు హతం?

దక్షిణ లెబనాన్‌లో పలువురు హిజ్బుల్లా కమాండర్లు హతం?

World
Israel-Hezbollah war | జెరూసలేం: దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్‌ను వైమానిక దాడిలో హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌లు "దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా క్షిపణి యూనిట్ కమాండర్ ముహమ్మద్ అలీ ఇస్మాయిల్ తోపాటు అతని డిప్యూటీని హతమార్చాయి" అని మిలిటరీ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా కమాండర్ల గురించి ఇజ్రాయెల్ ప్రకటనను హిజ్బుల్లా ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు.ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మిలిటరీ శుక్రవారం బీరూట్‌లోని హిజ్బుల్లా యొక్క సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి చేసింది, అక్కడ భారీ పేలుళ్ల వరుస బహుళ భవనాలను నేలమట్టం చేసింది, ఆకాశంలో నారింజ నల్ల పొగ మేఘాలు కమ్ముకున్నాయి. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు UNను ఉద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే లెబనాన్ రాజధాని...
walkie-talkies Explosions | మ‌రో కొత్త త‌ర‌హా యుద్ధం. పేలిపోతున్న‌ వాకీ-టాకీలు, బ్యాట‌రీలు..

walkie-talkies Explosions | మ‌రో కొత్త త‌ర‌హా యుద్ధం. పేలిపోతున్న‌ వాకీ-టాకీలు, బ్యాట‌రీలు..

National, World
walkie-talkies Explosions | జెరూసలేం : లెబ‌నాన్ లో వేల సంఖ్య‌లో పేజర్లు పేలుళ్ల ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.. అది మ‌ర్చిపోకముందే.. మధ్యప్రాచ్య దేశం మళ్లీ హ్యాండ్‌హెల్డ్ రేడియోలు (వాకీ-టాకీలు), సాయుధ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉపయోగించిన సోలార్ పరికరాలను పేల్చివేసింది. ఈ పేలుళ్ల‌లో బుధ‌వారం మధ్యాహ్నం 20 మంది మరణించ‌గా,, 450 మందికి పైగా గాయపడ్డారు. ఇది మరింత ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఒక సంవత్సరం క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లా మధ్య ఇప్ప‌డు ఎన్న‌డూ ఊహించని విధంగా మ‌లుపులు తిరుగుతోంది.మంగళవారం పేజర్ పేలుళ్లపై ఇజ్రాయెల్ మౌనంగా ఉండగా, వాకీ-టాకీ పేలుళ్లు లెబనాన్‌ను కదిలించడంతో ఇజ్రాయెల్ సైన్యం బుధవారం 'కొత్త దశ' యుద్ధాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ బుధవారం ఇజ్రాయెల్ దళాలతో మాట్లాడుతూ, "మేము యుద్ధంలో కొత్త దశ ప్రారంభంలో ఉన్నా...
పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?

పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?

World
Pager | బీరుట్: లెబనాన్‌లో టెర్రర్ గ్రూప్ హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి పేజర్లు పేలిపోవడంతో   తొమ్మిది మంది మరణించగా, 2,800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో లెబనాన్‌లోని తమ రాయబారి మొజ్తాబా అమానీ కూడా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. లెబనాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు (సాయంత్రం 6 గంటలకు IST) పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని, దాదాపు 2,800 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ ధృవీకరించారు. పేజర్లు అంటే ఏమిటి? పేజర్ లేదా 'బీపర్' అనేది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ద్వారా సంక్షిప్త సందేశాలను స్వీకరించే చిన్న, పోర్టబుల్ కమ్యూనికేషన్ పరికరం. సెల్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు పేజర్లను విస్తృతంగా ఉప‌యోగించేవారు ముఖ్యంగా వైద్యులు, పాత్రికేయులు, సాంకేతిక నిపుణులు, యూత్ కోసం అప్ప‌ట్లో ఇది అత్యంత‌ కీలకమైన కమ్యూనికేషన్ సాధ...
Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

Pagers Explosion : సంచలనం రేపిన పేజర్ పేలుళ్లు.. వీడియోలు వైర‌ల్‌

World
Beirut : లెబ‌నాన్‌లో ఎప్పుడూ చూడ‌ని కొత్త త‌ర‌హా పేలుళ్లు సంచ‌ల‌నం సృష్టించాయి. హిజ్‌బుల్లాలు వాడే పేజ‌ర్ల‌ను హ్యాక్‌ చేసి ఒక్క‌సారిగా పేల్చేశారు (Pagers Explosion). దీంతో లెబ‌నాన్‌లోని అనేక ప్రాంతాల్లో వేల మంది గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల‌లో ఉండే.. లిథియం బ్యాట‌రీల‌ను పేలుళ్ల కోసం వాడారు. పేజ‌ర్ పేలుళ్ల‌లో లెబ‌నాన్‌, సిరియాల్లో సుమారు మూడు వేల మంది గాయ‌ప‌డ్డారు. ఎనిమిది మంది మృతి చెందారు. అయితే పేజ‌ర్ పేలుళ్ల‌కు సంబంధించిన‌ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. పేజ‌ర్ వినియోగించేవారు ఒక్క‌సారిగా అది పేల‌డంతో తీవ్ర గాయాల‌పాలై కుప్ప‌కూలిపోయారు. సుమారు 1200 మంది హిజ్‌బుల్లా ఆప‌రేటివ్స్ ఈ కొత్త త‌ర‌హా పేలుళ్ల‌తో గాయ‌ప‌డ్డారు. పేజ‌ర్ల దాడి వెనుక ఇజ్రాయిల్ హ‌స్తం ఉంద‌ని లెబ‌నాన్ ఆరోపిస్తుంది. Over 1,200 Hezbollah operatives injured in alleged Israeli supply-chain attack...
Donald Trump | ట్రంప్ పై మ‌రో హ‌త్యాయ‌త్నం.. రెండు నెలల్లో రెండవ సారి..

Donald Trump | ట్రంప్ పై మ‌రో హ‌త్యాయ‌త్నం.. రెండు నెలల్లో రెండవ సారి..

World
Donald Trump assassination attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పై మ‌రోసారి హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ వెలుపల తుపాకీ కాల్పులు వినిపించాయి. ఈ క్ర‌మంలో రెండు నెలల్లో ట్రంప్ రెండవ హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తెలిపింది. ఆదివారం (సెప్టెంబర్ 15). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లోకి రైఫిల్‌ను గురిపెట్టి కాల్పులు జరిపిన వ్యక్తిని ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు.ఫోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ దుండ‌గుడు అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. హుటాహుటిన ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.అమెరికా కాలమానం ప్రకారం ...
IRCTC ఈ టూర్ ప్యాకేజీ చాలా ప్రత్యేకమైనది.. త‌క్కువ ఖ‌ర్చుతో థాయ్‌లాండ్ టూర్‌..

IRCTC ఈ టూర్ ప్యాకేజీ చాలా ప్రత్యేకమైనది.. త‌క్కువ ఖ‌ర్చుతో థాయ్‌లాండ్ టూర్‌..

World
IRCTC Thailand Tour Package : ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా విదేశాల‌ను సందర్శించాలని ఎన్నో కలలు కంటారు. కానీ బడ్జెట్ ప‌రిమితుల‌ కార‌ణంగా చాలా మందికి జీవిత కాలం సాధ్య‌ప‌డ‌దు. ఎందుకంటే విదేశాలకు వెళ్లాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మీరు కూడా అదే ఆలోచిస్తే ఈ వార్త మీకు మంచి వార్త కావొచ్చు. ఎందుకంటే మీరు చాలా తక్కువ డబ్బుతో థాయ్‌లాండ్‌ని సందర్శించే అవకాశాన్ని ఐఆర్సీటీసీ ద్వారా పొంద‌వ‌చ్చు. ఇది మాత్రమే కాదు, మీరు టూర్ ప్యాకేజీ సమయంలో అన్ని రకాల సౌకర్యాలను ఆస్వాదించ‌వ‌చ్చు. అయితే ఈ పర్యటనను బెంగళూరు పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టూర్ ప్యాకేజీలో మీకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో చూడండి. Thailand Tour Package వివరాలు.. IRCTC ఈ టూర్ ప్యాకేజీని థాయ్‌లాండ్ డిలైట్స్ ఎక్స్ బెంగళూరు (THAILAND DELIGHTS EX BENGALURU) గా పేర్కొంది. అలాగే, ప్యాకేజీ కోడ్ విష‌యానికొస్తే.. అది SBO5....
Bangladesh | పాక్ చెర‌లోకి వెళ్తున్న బంగ్లాదేశ్‌.. ?

Bangladesh | పాక్ చెర‌లోకి వెళ్తున్న బంగ్లాదేశ్‌.. ?

World
Bangladesh | బంగ్లాదేశ్ ఇస్లాంవాదులు, ప్రస్తుత పాలకుల తీరు తమ దేశాన్ని పాకిస్తాన్ వైపు మళ్లించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ వ్యవస్థాపకుడు.. మొహమ్మద్ అలీ జిన్నా వర్ధంతిని గ‌త‌ బుధవారం ఢాకాలో ఘనంగా నిర్వహించారు. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ బద్దశత్రువుగా భావించిన జిన్నాను విచిత్రంగా 76వ వర్ధంతి ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో కీర్తిస్తూ ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా ఉర్దూలో జిన్నాను పొడిగేలా పాటలు పాడ‌డ‌మే కాకుండా.. కొంద‌రు వక్తలు జిన్నాను 'జాతి తండ్రి'గా పేర్కొనాలని పిలుపునిచ్చారు.బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ కమ్రాన్ దంగల్ హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు బంగ్లాదేశ్‌లో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుత పాలనకు అనుగుణంగా ఉన్నారు. ఈవెంట్‌లో చాలా మంది వక్తల ...
Earthquake in Delhi -NCR | పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం.. ఢిల్లీలోనూ ప్ర‌కంప‌న‌లు

Earthquake in Delhi -NCR | పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం.. ఢిల్లీలోనూ ప్ర‌కంప‌న‌లు

World
Earthquake in Delhi-NCR : పాకిస్తాన్‌లో ఈరోజు (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ త‌ర్వాత ఢిల్లీ ప‌రిస‌ర‌ప్రాంతంలో ప్రకంపనలు ఏర్పడ్డాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. దేశయ‌ వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం నాడు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఇది పాకిస్థాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:28 గంటలకు ఉద్భవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో నమోదైందని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని నైరుతి భాగంలో డేరా ఘాజీ ఖాన్ ప్రాంతానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖను ఉటంకిస్తూ జి0యో న్యూస్ నివేదించింది.అయితే భూకంపం (Ea...
Bangladesh Crisis | బంగ్లాదేశ్ పై కారు చీకట్లు.. పీకల్లోతు అప్పులు.. అదానీ గ్రూపునకు 800 మిలియన్ డాలర్లు..

Bangladesh Crisis | బంగ్లాదేశ్ పై కారు చీకట్లు.. పీకల్లోతు అప్పులు.. అదానీ గ్రూపునకు 800 మిలియన్ డాలర్లు..

World
Adani Group | షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఆర్థిక సంక్షోభం (Bangladesh Crisis) తీవ్రమవుతోంది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ ఇటీవల రుణాల కోసం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)తో పాటు పలు చోట్ల తలుపులు తట్టారు. ఇప్పుడు అతడి ముందు మరో కొత్త ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా బిల్లును చెల్లించాలని అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌పై ఒత్తిడి చేయడం ప్రారంభించింది.  దాదాపు 500 మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లించాలని అదానీ గ్రూప్ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వ ఒప్పందాలపై విమర్శలు.. అదానీ గ్రూప్ తన 1600 మెగావాట్ల గొడ్డ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే   ఇప్పుడు మహ్మద్ యూనస్ దీనిని చాలా ఖరీదైన ఒప్పందం అని పిలవడం ప్రారంభించాడు. ఈ డీల్‌లో కూడా పారదర్శకత పాటించలేదని, షేక్ హ...