Indiramma Illu Scheme | రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే నాలుగేళ్లలో నిరుపేదల కోసం 20 లక్షల ఇండ్లను నిర్మిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) మంగళవారం వెల్లడించారు. హియాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు.
33 జిల్లాలకు 33 మంది ప్రాజెక్టు డైరెక్టర్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్ధాయి ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించారు. ప్రతి సంవత్సరం నాలుగున్నర లక్షల చొప్పున రానున్న నాలుగేళ్లలో 20 లక్షలకు పైగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. హౌసింగ్ కార్పొరేషన్ బలోపేతం చేస్తున్నామని తెలిపారు. వివిధ విభాగాలలో పనిచేస్తున్న 95 శాతం కార్పొరేషన్ ఉద్యోగులను వెనక్కి పిలిపించామని ఈ ఏడాది నాలుగన్నర లక్షల ఇండ్ల నిర్మాణమే కాకుండా 20 లక్షల ఇండ్లు నిర్మించడానికి అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటుంటున్నామని వివరించారు.
దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం
Indiramma iIlu Applications : మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ప్రక్రియ కూడా వేగంతంగా చేస్తున్నారు. ఈనెల 23 నాటికి సుమారు 32 లక్షల దరఖాస్తులను పరిశీలించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రోజుకు నాలుగున్నర నుంచి ఐదున్నర లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.జనవరి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 80 లక్షల దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత లబ్దిదారుల ఎంపిక చేస్తారు. సంక్రాంతి నాటికి ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మొదటి విడతలో వికలాంగులు, వితంతువులు వంటి వారికి అవకాశం ఇస్తారు. . కేంద్ర ప్రభుత్వం తన నిబంధనల మేరకు కొంతమందిని తిరస్కరించినా రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.
త్వరలో 1200 మంది సర్వేయర్ల పోస్టుల భర్తీ
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి (indiramma housing scheme ) ప్రత్యేక విధివిధానాలు ప్రకటించన్నారు. వారం లోగా ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నెంబర్లు ను కూడా ప్రకటించనున్నారు. ప్రజలు తమ సందేహాలు, ఫిర్యాదులను ఆయన టోల్ ఫ్రీ నంబర్ కు చేయవచ్చు.ఇప్పటికే గ్రామాల వారీగా రెవెన్యూ అధికారుల నియామకానికి రంగం సిద్ధం చేస్తున్నామని త్వరలో 1200 వరకు సర్వేయర్లను నియమిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..