Telangana | పేదలకు అదిరిపోయే గుడ్ న్యూస్ మరికొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక
Indiramma Housing Scheme | సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు గుడ్ న్యూస్.. మరికొద్ది రోజుట్లోనే ఇందిరమ్మ ఇళ్ల 15 రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయనున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఎంపికే తుది నిర్ణయమని, ఇండ్లు కూడా మహిళల పేరిటే మంజూరు చేస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Punguleti Srinivas Reddy) తెలిపారు. మరో ముఖ్య విషయమేమిటంటే ఈసారి లబ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే చాన్స్ కల్పిస్తున్నారు. రాజకీయ జోక్యం లేకుండా నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి తెలిపారు. లబ్దిదారుల ఎంపికలో ప్రత్యేక యాప్ దే కీలకపాత్ర, అందుకే ఇంత సమయం పట్టిందని వివరిచారు. ఆధార్‌తో సహా అన్నివివరాలు కొత్తగా తీసుకొస్తున్న యాప్ లో పొందుపరుస్తారు.
ఎలాంటి డిజైన్లు లేవు..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవు. లబ్దిదారుల అభిరుచి, ఆర్థిక స్థోమత మేరకు తమ సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు కనీసం 400 చదరపు గజాలు తగ్గకుండా లబ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇండ్లలో తప్పనిసరిగా వంటగది, బాత్రూం నిర్మించుకోవాలనే నిబంధన ఉంది. నాలుగు దశల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఉంటుంది. నిర్మాణ దశల వారీగా లబ్దిదారులకు చెల్లింపులు ఉంటాయి. పునాదికి రూ.లక్ష, గోడలకు లక్షా రూ.25వేలు, శ్లాబ్‌కు రూ.1.50 లక్షలు, ఇల్లు పూర్తయితే రూ.లక్ష చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ లోనే జమ చేయనున్నారు.
కేంద్రం ఇచ్చే నిధులను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం చెల్లిస్తుంది. నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని, ప్రతీ నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.ప్రభుత్వం తరపున 5 లక్షల సాయం ఇస్తామని, లబ్దిదారులు ఆర్థిక పరిస్దితి బట్టి ఇంకా కట్టుకోవచ్చు. దేశంలో తెలంగాణ మాత్రమే తరహా భారీ గృహ నిర్మాణం చేపట్టి, 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మరో విశేషమేమింటే.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన సుమారు 600 -800 ఇండ్ల నిర్మాణానికి కూడా ఆర్థికసాయం అందిస్తామని తెలిపారు. తొలి విడతగా సుమారు రూ.28 వేల కోట్ల వరకు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. సుమారు రూ.7,740 కోట్లను ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్‌లో కేటాయించారు. పునాది పూర్తయిన వెంటనే తొలివిడత నిధుల విడుదల చేస్తాం. నిర్మాణాలు జరిగేలోగా మళ్లీ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Indiramma Housing Scheme : ఇండ్ల స్ధలాలు లేనివారికి 2వ దశలో స్ధలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్ధలాన్ని సమకూర్చి ఇస్తామని, ఎక్కడైనా కొత్తగా ఇందిరమ్మ కాలనీలు ఏర్పడితే కరెంట్, రోడ్లు , డ్రైనేజ్ తదితర మౌలిక వసతులను ప్రభుత్వమే కల్పిస్తుందని తెలిపారు.గత ప్రభుత్వం ధనిక రాష్ట్రమని చెప్పి కేంద్రాన్ని ఇండ్లు అడగలేదు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లలో నీళ్లు, కరెంట్ , డ్రెయినేజీ వంటి వసతుల్లేవు. మేము అవన్నీ కల్పించి లబ్దిదారులకు అప్పగిస్తున్నామని, 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో 19.36 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించారని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు