Indiramma Housing Scheme Update : రాష్ట్ర ప్రభుత్వం ఇందిమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ లో కొన్ని మార్పులుచేర్పులు చేసిన తర్వాత త్వరలోనే యాప్ ను విడుదల చేయనున్నారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy ) వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. ఇండ్ల లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందని, రాజకీయ పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు. లబ్దిదారుల ఎంపిక నిమిత్తం రూపొందించిన యాప్‌ను శనివారం ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో పరిశీలించారు. అయితే ఈ యాప్‌లో ఒకటి రెండు మార్పు చేర్పులు చేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. మంత్రి సూచనల మేరకు యాప్‌లో మార్పులు చేసి వచ్చే వారం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని యాప్‌లో తెలుగు వెర్షన్ ఉండేలా చూడాలని మంత్రి సూచించారు. లబ్దిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యే వరకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని అధికారులకు సూచించారు. ఇండ్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రతీ నియోజకవర్గానికి 4000 ఇండ్లు
ఇందిరమ్మ పథకం కింద ప్రతీ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500, నుంచి 4000 వరకు ఇండ్లు మంజూరు చేయనున్నారు. అయితే ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెలఖారులోనే అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈనెల చివరి నాటికి ఇళ్లను మంజూరు చేయబోతున్నామని ప్రకటించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..