
Indian Railways : దసరా, దీపావళి పర్వదినాలను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను (special trains) నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి- అనకాపల్లి- చర్లపల్లి మధ్య మొత్తంగా 8 సర్వీసులు నడిపిస్తోంది. ఈ రైళ్లు సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 5వ తేదీ మధ్య ప్రతి శని, ఆదివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
చర్లపల్లి- అనకాపల్లి రైలు (07035) సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 4వరకు ప్రతి శనివారం;
అనకాపల్లి- చర్లపల్లి రైలు (07036) సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 5వరకు ప్రతి ఆదివారం సర్వీసులు అందించనున్నాయి.
హాల్టింగ్ స్టేషన్స్ ఇవే..
ఈ ప్రత్యేక రైళ్లు క్రింది స్టేషన్లలో ఆగుతాయి:
- ఎలమంచిలి
- జనగామ
- కాజీపేట
- వరంగల్
- మహబూబాబాద్
- డోర్నకల్
- ఖమ్మం
- మధిర
- రాయనపాడు
- ఏలూరు
- తాడేపల్లిగూడెం
- నిడదవోలు
- రాజమండ్రి
- సామర్లకోట
- అన్నవరం
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.