Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి
Indian Railway Recruitment 2024 | భారతీయ రైల్వేల్లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్‌లుగా (TTE) పని చేయాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం. నిరుద్యోగ యువత కోసం ఇండియన్ రైల్వే ఏకంగా 12,000 టిటిఈ పోస్టు(TTE Vacancies) లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసంది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో అధికారిక రైల్వే TTE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ని విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా సుమారు 12,000 ఖాళీలను భర్తీ చేయనుంది.
ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2024
ముఖ్య వివరాలు:
అర్హత ప్రమాణాలు:
వయోపరిమితి: జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు.
విద్యార్హత: అభ్యర్థులు కనీసం 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా హోల్డర్లు కూడా అర్హులు.
అవసరమైన పత్రాలు:
- జనన ధ్రువీకరణ పత్రం
- 12వ తరగతి పాస్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- ఎక్సట్రా కరిక్యులర్ సర్టిఫికెట్
- నివాస రుజువు
- గ్రాడ్యుయేషన్ డిప్లొమా
దరఖాస్తు ప్రక్రియ:
- అప్లికేషన్ అధికారిక RRB వెబ్‌సైట్: indianrailways.gov.in ద్వారా ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
- ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత అప్లికేషన్ విండో 30 రోజుల పాటు తెరిచి ఉంటుంది.
- అభ్యర్థులు తమ కేటగిరీ ప్రకారం దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఖచ్చితమైన పూర్తి సమాచారాన్ని సమర్పించాలి.
పరీక్షా విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT):
- జనరల్ అవేర్‌నెస్, అరిథ్‌మెటిక్, టెక్నికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు.
- పరీక్ష వ్యవధి: 2 గంటలు, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు పెనాల్టీ లు ఉంటుంది. .
శారీరక పరీక్ష:
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శారీరక దృఢత్వాన్ని పరీక్షిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:
- RRB వెబ్‌సైట్ rrcb.gov.in ని సందర్శించండి.
- ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, అవసరమైన పత్రాలను జత చేయండి దరఖాస్తు రుసుమును చెల్లించండి.
- దరఖాస్తు ఫారమ్ సరిగ్గా ఉందని క్షుణ్ణంగా పరిశీలించుకొని ఆన్‌లైన్‌లో సమర్పించండి.
- అప్లికేషన్ లింక్, అడ్మిట్ కార్డ్, పరీక్ష తేదీలకు సంబంధించిన అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..