
India Pakistan War live updates | పాకిస్తాన్ పలు చోట్ల జరిపిన దాడులకు బలమైన ప్రతిస్పందనగా భారత్ గురువారం రాత్రి లాహోర్(Lahore), సియాల్‌కోట్ (Sialkot)లపై క్షిపణులతో దాడి చేసింది. ఈ రెండు ముఖ్యమైన నగరాలపై డ్రోన్ దాడులను ప్రారంభించడం ద్వారా భారతదేశం పాకిస్తాన్ దురాక్రమణకు ప్రతీకారం తీర్చుకుంది.
పశ్చిమ సరిహద్దుల్లో వివిధ ప్రదేశాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగినట్లు భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. క్షిపణి దాడులను సైతం సమర్థవంతంగా నాశనం చేశామని భారత సైన్యం తెలిపింది. లాహోర్‌పై దాడి చేయడమే కాకుండా, పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థను కూడా భారతదేశం ధ్వంసం చేసింది.
పశ్చిమ సరిహద్దుల వెంబడి వివిధ ప్రదేశాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగినట్లు భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. లాహోర్ పై దాడి చేయడమే కాకుండా, పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థను కూడా భారతదేశం ధ్వంసం చేసింది. సాయంత్రం పాకిస్తాన్ సత్వారీ, సాంబా, ఆర్ఎస్ పురా, అర్నియాలను లక్ష్యంగా చేసుకుని ఎనిమిది క్షిపణులను ప్రయోగించింది. వాటన్నింటినీ వైమానిక రక్షణ విభాగాలు అడ్డుకున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పాకిస్తాన్ డ్రోన్‌లను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నప్పుడు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. జైసల్మేర్‌లో పాకిస్తాన్ డ్రోన్‌లను భారత వైమానిక రక్షణ దళాలు అడ్డుకున్నాయి. ఆకాశంలో పేలుళ్ల శబ్దాలు, మెరుపులు కనిపించాయి.
రాజస్థాన్‌లోని బికనీర్‌లో మరియు పంజాబ్‌లోని జలంధర్‌లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేసింది. కిష్త్వార్, అఖ్నూర్, సాంబా, జమ్మూ, అమృత్సర్, జలంధర్‌లలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారతదేశంతో ఉద్రిక్తతలను పెంచుతూ, పాకిస్తాన్ గురువారం జమ్మూను లక్ష్యంగా చేసుకుని మిసైల్స్ ను ప్రయోగించింది. భారత వైమానిక దళం ప్రతిగా కాల్పులు జరుపుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.